గిరిజన గ్రామాల్లో కలెక్టర్, ఎస్పీ సుడిగాలి పర్యటన
మక్కువ: మండలంలోని బాగుజోల, చిలకమెండంగి గ్రామాల్లో కలెక్టర్ ఎ.శ్యాంప్రసాద్, ఎస్పీ ఎస్.వి. మాధవ్‌రెడ్డి, ఆర్డీఓ హేమలత బుధవారం సుడిగాలి పర్యటన చేశారు. ఉపముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్ ఈ నెల 20న సాలూరు మండలంలోని గిరిశిఖర గ్రామం సిరివొరలో రోడ్డు పనుల ప్రారంభానికి వస్తారని అధికారులకు సమాచారం అందింది. ఈ మేరకు సిరివొర గ్రామం చేరుకునేందుకు మార్గంమధ్యలో ఉన్న గిరిశిఖర గ్రామాలైన బాగుజోల, చిలకమెండంగి గ్రామాల రోడ్లను కలెక్టర్, ఎస్పీ పరిశీలించారు. రోడ్డు నిర్మాణానికి అవసరమైన శిలాఫలకం ఏర్పాటు, బందోబస్తు అంశాలను అధికారులకు దిశానిర్దేశం చేశారు. గిరిజనులతో ముచ్చటించారు. పంటలు సాగు, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సాలూరు సీఐ రామకృష్ణ, ఎస్‌ఐ వెంకటరమణ, సీడీపీఓ అనంతలక్ష్మి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment