21న తోటపల్లి ప్రాజెక్టు చైర్మన్ ఎన్నిక
● నోటిఫికేషన్ విడుదల చేసిన కలెక్టర్
వీరఘట్టం: తోటపల్లి ప్రాజెక్టు కమిటీ చైర్మన్ ఎన్నికలు నిర్వహించేందుకు కలెక్టర్ శ్యాంప్రసాద్ బుధవారం నోటిఫికేషన్ విడుదల చేశా రు. వీరఘట్టం మండల పరిషత్ కార్యాలయంలో డ్వామా పీడీ ఆధ్వ ర్యంలో ఎన్నికలు నిర్వహించనున్నట్టు ఎంపీడీఓ బి.వెంకటరమణ తెలిపారు. ఈ మేరకు మండల పరిషత్ కార్యా లయం వద్ద ఎన్నికల జలవనరులశాఖ ఏఈ డి.వి.రమణతో కలిసి నోటిఫికేషన్‌ను నోటీస్ బోర్డులో అతికించారు. జిల్లాలోనే అతిపెద్ద భారీ సాగునీటి పారుదల ప్రాజెక్టు తోటపల్లి. దీని పరిధిలో 25 నీటి వినియోగదారుల సంఘాలకు ఈనెల 14న ఎన్నికలు నిర్వహించగా, వీటిలో ఐదు డిస్ట్రిబ్యూటరీలకు ఈనెల 17న ఎన్నికలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ నెల 21న జరగనున్న తోటపల్లి ప్రాజెక్టు కమిటీ చైర్మన్ ఎన్నికల్లో వీరఘట్టం, తూడి, ఎం.సింగపురం, రావివలస, రాజులగుమ్మడ డిస్ట్రిబ్యూటరీ కమిటీల అధ్యక్షులు పాల్గొంటా రు. వీరిలో ఒకరిని ప్రాజెక్టు చైర్మన్‌గా, మరొకరిని వైస్ చైర్మన్‌గా ఎన్నుకోనున్నారు.
ఆ ప్రాంతం వారికే మొగ్గు..
తోటపల్లి ప్రాజెక్టు పరిధిలోని వీరఘట్టం, తూ డి, ఎం.సింగుపురం, రాజులగుమ్మడ, రావివలస డిస్ట్రి బ్యూటరీలు వీరఘట్టం, పాలకొండ, వంగర, గరుగుబిల్లి మండలాల్లో ఉన్నాయి. వీటిలో నాలుగు డిస్ట్రిబ్యూటరీలకు వీరఘట్టం, పాలకొండకు చెందిన వారే సంఘ అధ్యక్షు లుగా ఎంపికయ్యారు. ఈ నేపథ్యంలో తోటపల్లి ప్రాజెక్టు కమిటీ చైర్మన్ పదవి కూడా ఈ ప్రాంతం వారికే దక్కుతుందని అంతా భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment