సెరిబ్రల్ మలేరియాతో వ్యక్తి మృతి
వీరఘట్టం: మండలకేంద్రంలోని సెడిగివీధికి చెందిన ఉండ్రాళ్ల హరిబాబు, కుమారుడు విష్ణవర్ధన్ రాజులకు మలేరియా జ్వరం రావడంతో శ్రీకాకుళంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా తండ్రి హరిబాబు(35) ఆదివారం తెల్లవారుజామున మృతిచెందాడు. ఏడాదిన్నర వయస్సు గల విష్ణువర్ధనరాజు ఐసీయులో మృత్యువుతో పోరాడుతున్నాడు. ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి. హరిబాబు వీరఘట్టంలోని ప్రభుత్వ మద్యం దుకాణంలో సేల్స్‌మన్‌గా పనిచేసేవాడు. ప్రభుత్వ మద్యం దుకాణాలను కూటమి ప్రభుత్వం ఎత్తివేయడంతో ప్రస్తుతం ఎటువంటి ఉద్యోగం లేక ఖాళీగా ఉన్నాడు. ఏదైనా ప్రైవేట్ ఉద్యోగంలో చేరేందుకు ఇటీవల ముమ్మరంగా ప్రయత్నం చేస్తున్నాడు.ఇంతలో ఈనెల 16న జ్వరం రావడంతో వీరఘట్టంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో మూడు రోజుల పాటు చికిత్స తీసుకున్నాడు. అలాగే తన ఏడాదిన్నర కుమారుడికి కూడా జ్వరం రావడంతో ఇదే ఆస్పత్రిలో చికిత్స చేయించాడు. వారిద్దరికీ జ్వరం తీవ్రత తగ్గకపోవడంతో ఈనెల 19న శ్రీకాకుళంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో బంధువులు చేర్పించారు. వైద్య పరీక్షలు చేయగా హరిబాబుకు సెరిబ్రిల్ మలేరియా ఉన్నట్లు రిపోర్ట్‌లో తేలింది. అలాగే ప్లేట్‌లెట్స్ కూడా తగ్గిపోవడంతో ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. ఇంతలోనే ఈనెల 20న కోమాలోకి వెళ్లినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈనెల 21న రోజంతా హరిబాబును వెంటిలేటర్‌పై ఆదివారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఇదిలా ఉండగా కుమారుడు విష్ణువర్ధన రాజు ఐసీయూలో విషమ పరిస్థితుల్లో చికిత్స పొందుతున్నాడు. ఓ వైపు భర్త చనిపోవడం, మరో వైపు కొడుకు చావుబతుకులతో పోరాడు తుండడంతో మృతుడి భార్య హిమశ్రీ తల్లడిల్లిపోయింది.
మృతుడి కుమారుడి పరిస్థితి విషమం
డివైడర్‌ను ఢీకొని వ్యక్తి..
విజయనగరం క్రైమ్: స్థానిక ప్రసాద్‌నగర్‌కు చెందిన శ్రీపతి మురళీకృష్ణరావు (60)బైక్‌తో డివైడర్‌ను ఢీకొని ఆదివారం మృతి చెందారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. ఉదయం ఆయన టిఫిన్ కొనుగోలు చేసేందుకు వీటీ అగ్రహారం బైక్‌పై వచ్చారు. తిరిగి ఇంటికి వెళ్లే క్రమంలో రక్తపోటు ఎక్కువవడంతో బైక్ రేజింగ్ ఇచ్చేశారు. దీంతో పక్కనే ఉన్న డివైడర్‌ను బలంగా ఢీకొట్టి పడిపోగా తలకు తీవ్రగాయం కావడంతో రక్తస్రావం ఎక్కువైంది. స్థానికులందించిన సమాచారంతో 108 వచ్చి జిల్లా కేంద్రాస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మురళీకృష్ణ మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు రూరల్ ఎస్సై వి.అశోక్ కుమార్ కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment