త్రిపుర హైకోర్టులో పెండింగ్ కేసుల్లేవు..
కొత్తవలస :
త్రిపుర హైకోర్టులో ఎటువంటి కేసులు పెండింగ్‌లో లేవని, కోర్టుకు తాళం వేసి వచ్చానని ఆ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి టి.అమర్‌నాధ్‌గౌడ్ అన్నారు. మండలంలోని గురుదేవ చారిటబుల్ ట్రస్ట్‌లో ఏర్పాటు చేసిన క్యాన్సర్ ఆస్పత్రి ప్రారంభానికి ఆయన ఆదివారం హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను ఆ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత అక్కడ పెండింగ్‌లో ఉన్న 65 శాతం కేసులను పరిష్కరించానని తెలిపారు. వరుసగా నాలుగైదు రోజులు కేసులు లేకపోవడంతో కోర్టుకు తాళం వేసి ఉంటుందన్నారు. ఇలాంటి పరిస్థితి దేశం అంతా ఉండాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. తాను గతంలో ప్రపంచ రికార్డులో భాగంగా భారతదేశం నుంచి 92 వేల కేసులకు తీర్పులు చెప్పానని, రోజుకు సరాసరి 109 కేసులకు సంబంధించి జడ్జిమెంట్లు ఇచ్చానని తెలిపారు. ఇందులో కేవలం 19 కేసులు మాత్రమే సుప్రీం కోర్టుకు అప్పీల్‌కు వెళ్లాయని చెప్పారు. దీన్ని బట్టి కక్షిదారులు, న్యాయవాదులు ఎంత సంతోషకరంగా ఉన్నారో అర్ధం చేసుకోవాలన్నారు. ఇది తనకు ఎంతో ఆత్మ సంతృప్తి ఇచ్చిందన్నారు.
తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న సమయంలో 2 లక్షల 30 వేల కేసులు పెండింగ్‌లో ఉంటే 88 వేల కేసులను పరిష్కరించినట్టు తెలిపారు. లిటిగేషన్ లేని కోర్టు, పేషంట్ లేని ఆస్పత్రులు, వృద్ధుల్లేని వృద్ధాశ్రమాలు ఉండాలని కోరుకుంటున్నట్టు పేర్కొన్నారు.
పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరుకు చెందిన ముత్తు చిల్వాన్ ఆసియా దేశాల పర్యటనకు సైకిల్ యాత్ర చేపట్టాడు. యాత్రలో భాగంగా మండలంలో ఖడ్గవలస జంక్షన్‌కు ఆయన ఆదివారం చేరుకున్నాడు. స్థానికులకు పర్యావరణంపై అవగాహన కల్పించారు. సైకిల్ యాత్రను 2021 డిసెంబర్ 28న ప్రారంభించినట్టు తెలిపారు. చిల్వాన్‌ను పలువురు అభినందించారు. – గరుగుబిల్లి
పర్యావరణ
పరిరక్షణకే
సైకిల్ యాత్ర
కోర్టుకు తాళం వేసి వచ్చా..
ఈ పరిస్థితి దేశం అంతా ఉండాలి..
త్రిపుర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అమర్‌నాధ్‌గౌడ్
Comments
Please login to add a commentAdd a comment