నగల దుకాణంలో అగ్ని ప్రమాదం
పాలకొండ రూరల్: స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో గల కార్తికేయ నగల దుకాణంలో ఆదివారం రాత్రి అగ్నిప్రమాదం సంభవించింది. సెలవు రోజు కావడంతో షాపు మూసి ఉండగా ఒక్కసారిగా పొగలు రావడాన్ని గుర్తించిన స్థానికులు యజమాని శేఖర్‌కు సమాచారం అందించారు. ఈ క్రమంలో విషయం తెలుసుకున్న లగ్నిమాక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలు అదుపుచేశారు. అప్పటికే దుకాణం పూర్తిగా అగ్నికి ఆహుతైంది. షాపులో పదికిలోల వెండి ఆభరణాలు, కిలో బంగారు వస్తువులు ఉన్నాయని, వాటితో పాటు విద్యుత్ పరికరాలు, ఏసీలు, ఫర్నిచర్ పూర్తిగా దగ్ధం కావడం, పండగల సీజన్‌లో జీవనోపాధి అయిన దుకాణం కాలి బూడిదవడంతో యజమానితో పాటు పనివారు కన్నీరు పెట్టుకున్నారు. సమాచారం మేరకు అక్కడికి చేరుకున్న సీఐ మీసాల చంద్రమౌళితోపాటు, అగ్నిమాపక ఎస్సై జామి సర్వేశ్వరావు, విద్యుత్ శాఖ సిబ్బంది ఘటనపై ఆరా తీశారు. విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment