ఉత్సాహంగా ‘సాక్షి’ స్పెల్ బీ సెమీఫైనల్
సీతమ్మధార: ‘సాక్షి’ స్పెల్ బీ రీజినల్ సెమీఫైనల్ పరీక్షకు విశేష స్పందన లభించింది. సాక్షి మీడియా ఆధ్వర్యంలో బాలయ్య శాస్త్రి లేఅవుట్‌లోని శ్రీ విశ్వ స్కూల్‌లో ఆదివారం పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షకు ప్రధాన స్పాన్సర్‌గా ‘డ్యూక్స్ వాఫీ’, అసోసియేట్ స్పాన్సర్‌గా ‘ట్రిప్స్ ఇంటర్నేషనల్ స్కూల్, రాజమండ్రి’ వ్యవహరించాయి. వివిధ కేటగిరీల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష నిర్వహించారు. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం ఉమ్మడి జిల్లాలకు చెందిన 150 మంది విద్యార్థులు ఈ పరీక్షకు హాజరయ్యారు. పరీక్ష బాగా రాశామని పలువురు విద్యార్థులు సంతోషం వ్యక్తం చేశారు. ‘సాక్షి’ మీడియా అందించిన ప్రిపరేషన్ మెటీరియల్ తమకు ఎంతగానో ఉపయోగపడిందని విద్యార్థులు సంతోషం వ్యక్తం చేశారు. పిల్లల భవిష్యత్ కోసం ఏటా ప్రత్యేక చొరవ తీసుకుని పరీక్షలు నిర్వహిస్తున్న ‘సాక్షి’ మీడియాకు విద్యార్థుల తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. పిల్లల మేథోశక్తిని పెంచేందుకు సాక్షి చేపట్టిన ఈ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమాన్ని ‘సాక్షి’బ్రాంచ్ మేనేజర్ చంద్రరావు పర్యవేక్షించగా.. శ్రీ విశ్వ విద్యా సంస్థల చైర్మన్ ధర్మరాజు, డైరెక్టర్లు శివాజీ, సూర్యనారాయణ, డీన్ హరికృష్ణ, ఉపాధ్యాయలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment