● లోక్‌సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు భీశెట్టి బాబ్జీ
విజయనగరం పూల్‌బాగ్: జిల్లాలో చిన్న, మధ్యతరహా పరిశ్రమలు ఏర్పాటు చేద్దామనుకునే ఉత్సాహవంతులకు కొంతమంది బ్యాంకర్లు సంబంధంలేని ప్రశ్నలు వేసి ఇబ్బంది పెడుతున్నారని లోక్‌సత్తాపార్టీ రాష్ట్ర అధ్యక్షడు భీశెట్టి బాబ్జీ అన్నారు. ఈ మేరకు రాష్ట్ర చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలనా మంత్రి కొండపల్లి శ్రీనివాస్కు ఆదివారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా బాబ్జీ మాట్లాడుతూ... ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్తను తయారుచేస్తానని ప్రకటనలు ఇస్తున్నా.. వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉందన్నారు. ఉన్నత చదువులు చదువుకున్న ఇద్దరు వ్యక్తులు బొబ్బిలి గ్రోత్ సెంటర్‌లో తమకున్న చిన్న పరిశ్రమను ఆధునీకరణ చెయ్యడానికి బొబ్బిలి యూనియన్ బ్యాంక్‌ను సంప్రదిస్తే గడచిన మూడు నెలలుగా తిప్పుతున్నారని ఆరోపించారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడం లేదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment