సినీ గేయ రచయితగా రామారాయపురం యువకుడు
● గ్రామీణ ప్రాంతం నుంచి సినీ పరిశ్రమ వైపు అడుగులు ● ఇప్పటి వరకూ 21కి పైగా పాటలు రచించిన చిరంజీవి
రాజాం/సంతకవిటి :
అతనొక సాధారణ కుటుంబం నుంచి వచ్చిన యువకుడు. అంతంత మాత్రంగానే ఆర్థిక స్థోమత ఉండడంతో డిగ్రీ పూర్తి చేసి ఉపాధి వైపు దృష్టి సారించాడు. ఒక వైపు ప్రైవేట్ కంపెనీల్లో పని చేస్తూ మరో వైపు మ్యూజిక్ డైరెక్టర్లకు పాటలు రచించి అందజేస్తున్నాడు. గత మూడేళ్ల కాలంలో 21కి పైగా సినీ పాటలు రచించి ఔరా అనిపించుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే..
సంతకవిటి మండలం రామారాయపురం గ్రామానికి చెందిన యెన్ని చిరంజీవి ఇటీవల హాట్ టాపిక్‌గా మారాడు. అయోధ్య శ్రీరామమందిర ఆల్బమ్‌కు సంబంధించిన సన్నివేశాలు, పాటలు ఎస్పీ ప్రొడక్షన్‌లో సమీర్ పిలకలపాటి నిర్మిస్తుండగా ఇందులో ‘అయోధ్య శ్రీరామ రూపం...ధరణీ దర్శన పుణ్యతీర్థం’ పాటను చిరంజీవి రచించారు. ఈ పాటను సత్యకశ్యప్, స్నికిత, శ్రాఘ్వీలు ఆలపించారు. ప్రస్తుతం ఈ పాట సామాజిక మాద్యమాల్లో కోట్లాది మందిని సొంతం చేసుకోంది. ఈ పాటను హిందీలో తన్వీర్‌గజ్వీ రచిస్తున్నారు. దీంతో చిరంజీవి పేరు తెరపైకి వచ్చింది.
చిరంజీవి విశేషాలు
చిరంజీవి 1నుంచి 5వ తరగతి వరకూ రామారాయపురం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో, 6 నుంచి పది వరకూ మందరాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో, ఇంటర్ సంతకవిటి జూనియర్ కళాశాలలో, డిగ్రీ(బీఏ) శ్రీకాకుళంలో హెచ్‌పీఎల్ కళాశాలలో పూర్తి చేసారు. డిగ్రీ అనంతరం కంప్యూటర్ వర్క్స్ పూర్తి చేసారు. సినీ పాటలపై మక్కువతో హైదరాబాద్ వెళ్లా డు. అక్కడ కొన్నాళ్లు ఉండి అవకాశాలు లేక తిరి గి ఇంటిముఖం పట్టాడు. పొందూరు సమీపంలో ఓ ప్రైవేట్ కంపెనీలో చేరిన చిరంజీవి తన పట్టుదల వదలలేదు. ఖాళీ సమయాల్లో పాట లు రాయడం, మ్యూజిక్ డైరెక్టర్లకు పంపించడం చేస్తున్నాడు. ఇందులో భాగంగా ఇటీవల ఈయన రచించిన పాటలు సినిమాలకు, వెబ్ సిరిస్‌లకు వినియోగించి, చిరంజీవికి పారితోషి కం అందించారు. చిరంజీవి తల్లిదండ్రులు కళావతి, కృష్ణమూర్తిలు రోజువారీ కూలీలు.
ఇప్పుడిప్పుడే..
చిరంజీవి రచించిన పాటలు ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నాయి. మ్యూజిక్ డైరెక్టర్ సత్యకశ్యప్, సినీ డైరెక్టర్ సీపాన శ్రీధర్‌లు చిరంజీవికి అవకాశాలు కల్పించారు. సత్యకశ్యప్ వైకల్యం సినిమాకు సంబంధించి ‘వనవాసమేలే సీతమ్మలా’ అనే లిరిక్‌తో కూడిన చిరంజీవి రచించిన పాట హిట్ అయ్యింది. ఈ పాటను దివ్యమాలిక్ గానం ఆలపించారు. ఈ సినిమాలో ఇంకో పాట సుద్దాల అశోక్‌తేజ రాయడం జరిగిందని చిరంజీవి వెల్లడించారు. ఇటీవల హ్యాపీ ఎండింగ్ వెబ్ సిరీస్‌కు ఒక పాటను అందించిన చిరంజీవి అంతకు ముందు పది సినిమాలకు, వెబ్ సిరీస్‌లకు పాటలు అందించారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో పలువురు ఎమ్మెల్యే అభ్యర్థులకు పాటలు రచించి ఔరా అనిపించుకున్నాడు. రేలారే రేలా రఘు అనే కళాకారునికి సైతం పాటను రచించి అందించినట్లు చిరంజీవి తెలిపాడు. గత మూడేళ్లలో తాను రాసిన 21 పాటలు హిట్ అవ్వడమే కాకుండా మంచి పేరు తీసుకొచ్చాయని, జనవరిలో కొత్త సినిమా ఆఫర్ ఉందని.. అందులో రెండు పాటలకు అవకాశం ఇస్తున్నట్లు నిర్మాతలు తెలిపారని చెప్పాడు.
యెన్ని చిరంజీవి
Comments
Please login to add a commentAdd a comment