స్కాన్‌యూలో అరుదైన వైద్యపరీక్ష | - | Sakshi
Sakshi News home page

స్కాన్‌యూలో అరుదైన వైద్యపరీక్ష

Published Wed, Jan 22 2025 1:37 AM | Last Updated on Wed, Jan 22 2025 1:37 AM

స్కాన్‌యూలో అరుదైన వైద్యపరీక్ష

స్కాన్‌యూలో అరుదైన వైద్యపరీక్ష

సాక్షి ప్రతినిధి, విజయనగరం: ఒకవైపు అల్ట్రా సౌండ్‌ స్కాన్‌ చేస్తూనే మరోవైపు సూది ద్వారా ఓ గర్భిణి ఉమ్మనీటిని సేకరించి గర్భస్త శిశువు ఆరోగ్య పరిస్థితిని పరిశీలించడమనే అరుదైన వైద్యపరీక్షను యువ రేడియాలజిస్ట్‌ డాక్టర్‌ కె.సాధన విజయవంతంగా నిర్వహించారు. విజయనగరం కోట జంక్షన్‌లో ఉన్న స్కాన్‌యూ ల్యాబ్‌లో ఆమె మీడియాకు ఈ వివరాలు వెల్లడించారు. ప్రఖ్యాత రేడియాలజీ కళాశాల స్టాన్లీలో విద్యాభ్యాసంతో పాటు ఫీటల్‌ మెడిసిన్‌లో అడ్వాన్స్‌ కోర్సు చేయడం ఈ వైద్యపరీక్షకు ఎంతో ఉపకరించాయని చెప్పారు. గర్భస్థ శిశువుకు జన్యుపరమైన, శారీరక లోపాలను గుర్తించడానికి సాధారణంగా గర్భం దాల్చిన తర్వాత ఏడో నెలలో వైద్య పరీక్షలు చేస్తున్నారని చెప్పారు. ఆ సమయంలో లోపాలు ఏమైనా గుర్తిస్తే గర్భవిచ్చిత్తికి, ప్రసవానికి కష్టమవుతుందని, ఒక్కోసారి బిడ్డతో పాటు తల్లి ప్రాణాలకూ ప్రమాదమవుతుందని వివరించారు. అలాగాకుండా మూడో నెలలోనే గర్భిణికి అల్ట్రాసౌండ్‌ స్కాన్‌ చేస్తూ మరోవైపు సూది ద్వారా ఉమ్మనీరు సేకరించి పరీక్షించడం ద్వారా ఆ ప్రమాదాన్ని తప్పించవచ్చన్నారు. 15 నుంచి 18 వారాల గర్భిణికి ఈ వైద్య పరీక్ష కచ్చితంగా చేయిస్తే మంచిదని చెప్పారు. గర్భస్త శిశువుకు ఏమైనా లోపాలున్నట్లు గుర్తిస్తే వైద్యుల సూచనలతో సరిచేసేందుకు, వీలుగాకపోతే తొలగించేందుకు అవకాశం ఉంటుందని వివరించారు. ఈ తరహా వైద్యపరీక్షలకు హైదరాబాద్‌, బెంగళూరు వ్యయప్రయాసలకోర్చి వెళ్లేవారని, ఇప్పుడు విజయనగరంలోనే అందుబాటులోకి వచ్చినట్టు ఆమె చెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement