సీపీఎం రాష్ట్ర మహాసభలు జయప్రదం చేయండి
విజయనగరం పూల్‌బాగ్: సీపీఎం 29వ రాష్ట్ర మహాసభలు పిబ్రవరి 1,2,3 న నెల్లూరు జిల్లాలో జరుగుతున్నాయి ఈ మహాసభల సందర్భంగా సీపీఎం విశిష్టత గురించి వాడవాడలా ప్రచారం జరుగుతోంది. అందులో భాగంగా మంగళవారం స్థానిక రామకృష్ణనగర్‌లో సీపీఎం ప్రచారాన్ని ప్రారంభించారు. అందుకుముందు జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు రెడ్డి శంకరరావు మాట్లాడుతూ పోరాటాల ద్వారానే సమస్యలు పరిష్కారమవుతాయని, ప్రజాసమస్యలపై నిరంతరం పోరాటాలు ఉధృతం చేయాలని పిలుపునిచ్చారు. సీపీఎం రాష్ట్ర మహా సభలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు శాంతమూర్తి, జగదాంబ తదితరులు పాల్గొన్నారు.
పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు
Comments
Please login to add a commentAdd a comment