వెలమ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడిగా రామునాయుడు
వేపాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వెలమ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడిగా చినగుడిపాల గ్రామ సర్పంచ్ బోజంకి రామునాయుడిని నియమించినట్లు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లగుడు గోవిందరావు ఓ ప్రకటనలో పేర్కోన్నారు. మంగళవారం వేపాడలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ వెలమ సామాజిక వర్గాన్ని ఆర్థిక, సామాజిక విభిన్నరంగాల్లో తగిన ప్రాధాన్యం కల్పించాలని కోరారు. అలాగే ఉపముఖ్యమంత్రి పదవి వెలమవర్గానికి ఇవ్వాలని, జనాభా దామాషా మ్రకారం వెలమ సామాజిక వర్గానికి నామినేటెడ్ పదవుల్లో ప్రాధాన్యం కల్పించాలని డిమాండ్ చేశారు. మే నెలలో విశాఖ వేదికగా జరగబోయే వెలమ గర్జనలో లక్షలాదిమంది పాల్గొనేలా జిల్లా అధ్యక్షులు కృషిచేయాలని కోరారు. జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికై న రామునాయుడు మాట్లాడుతూ వెలమ సంఘం సంక్షేమ అభివృద్ధి, వెలమకులస్తుల సమస్యల పరిష్కారానికి కృషిచేస్తానన్నారు.
Comments
Please login to add a commentAdd a comment