![గిరిజనులకు ఎంతో మేలు](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/10/09krp119a-370019_mr-1739129740-0.jpg.webp?itok=yoSuuyQw)
గిరిజనులకు ఎంతో మేలు
● రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్ డీవీజీ శంకరరావు
గుమ్మలక్ష్మీపురం: 1/70 చట్టం గిరిజనులకు ఎంతో మేలు చేస్తోందని రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్ డీవీజీ శంకరరావు అన్నారు. కురుపాం మండలం మంత్రజోల గ్రామంలో ఏర్పాటు చేసిన వన్‌ధన్ వికాస్ కేంద్రాన్ని ఆదివారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా గిరిజన ప్రజలతో ముఖాముఖి నిర్వహించి, వారు పండిస్తున్న పంటలు, మార్కెటింగ్ పరిస్థితి, జీవన ఉపాధుల గూర్చి ఆరా తీశారు. గిరిజన మహిళలు చిరుధాన్యాలతో చేస్తున్న బిస్కెట్ల తయారీ విధానాలను పరిశీలించారు. చిరుధాన్యాల ఉత్పత్తుల ప్రయోజనాల్ని ప్రజలకు అవగాహన కల్పిస్తూ సద్వినియోగించుకునేలా అధికారులు ప్రోత్సాహం అందించాల్సి ఉందన్నారు. చిరుధాన్యాలతో తయారు చేసిన బిస్కెట్లు విద్యార్థులు తింటే పౌష్టికాహారం అందుతుందని.. ఆశ్రమ పాఠశాలలు, వసతిగృహాల్లోని విద్యార్థులకు ఇవి అందేలా ప్రభుత్వంతో చర్చిస్తానన్నారు. అనంతరం ఆయన గుమ్మలక్ష్మీపురం వచ్చిన సందర్భంగా స్థానిక విలేకర్లతో మాట్లాడారు. 1/70 చట్టం గిరిజనులకు ఎంతో మేలు చేస్తుందన్నారు. ఈ చట్టాన్ని పూర్తిగా అమలు చేస్తూ పర్యాటకాభివృధ్ధి చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment