కొత్తవలస : మండలంలోని రెల్లి గ్రామ రెవెన్యూ పరిధిలో సర్వే నంబరు 1–8లో 526 ఎకరాల భూములను రాష్ట్ర డీజీపీ హరీష్‌గుప్త గ్రేహౌండ్స్ డీఐజీ కె.ప్రవీణ్‌తో కలిసి ఆదివారం పరిశీలించారు. ఈ భూములను 2017వ సంవత్సరంలో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం పాలనలో గిరిజన యూనివర్సిటీ నిర్మాణానికి కేటాయించారు. సదరు భూ ముల్లో గిరిజన యూనివర్సిటీ నిర్మాణానికి నిబంధనలు అడ్డు రావడంతో గత ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి సాలూరు నియోజకవర్గంలో 561 ఎకరాల భూములను సేకరించి అక్కడ నిర్మాణాలు చేశారు. దీంతో అప్పటి నుంచి కొత్తవలసలో భూములు ఖాళీగా వుండడంతో గ్రేహౌండ్స్ యూనిట్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం యోచించింది. కొద్ది నెలలు క్రితం పోలీస్ శాఖ ఉన్నతాధికారులు ఇక్కడ పర్యటించి భూములను పరిశీలించారు. ప్రస్తుతం డీజీపీ హరీష్‌గుప్త గ్రేహండ్స్ డీజీపీ కె.ప్రవీణ్, మరో 10 మంది సీనియర్ ఐపీఎస్ అధికారులు సదరు భూములను పరిశీలించారు. ఎస్పీ వకుల్ జిందల్, జేసీ సేతుమాధవన్, ఆర్డీఓ దాట్ల కీర్తి, స్థానిక తహసీల్దార్ బి.నీలకంఠరావు ఉన్నారు.
అంతా గోప్యం..
ఇదిలా ఉండగా రాష్ట్ర డీజీపీ పర్యటనను అధికారు లు గోప్యంగా ఉంచారు. మీడియాను అనుమతించ లేదు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే గోప్యంగా ఉంచామని తెలిపారు. వీరి పర్యటనను కవరేజి చేసేందుకు వెళ్లిన మీడియా ప్రతినిధులను సుమా రు రెండు కిలోమీటర్ల దూరంలోనే పోలీసులు నిలువరించారు.
గ్రేహౌండ్స్ యూనిట్ ఏర్పాటు చేసే యోచన
పర్యటన మీడియాకు తెలియకుండా గోప్యం
Comments
Please login to add a commentAdd a comment