బోనస్ చెల్లించకుంటే సమ్మె తప్పదు
పాలకుర్తి(రామగుండం): కేశోరాం సిమెంట్ కర్మాగారం యాజమాన్యం దీపావళి బోనస్ చెల్లింపు విషయంలో నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తోందని కాంట్రాక్టు కార్మిక సంఘం అధ్యక్షుడు కౌశిక హరి ఆరోపించారు. కౌశిక హరి, మాదాసు శ్రీనివాస్ ఆధ్వర్యంలో శుక్రవారం కార్మికులతో కలిసి కంపెనీ ఎదుట బైఠాయించారు. హరి మాట్లాడుతూ రెండు రోజుల్లో కార్మికులకు దీపావళి బోనస్ చెల్లింపు విషయంపై తుది నిర్ణయం తీసుకోవాలన్నారు. లేనిపక్షంలో సోమవారం నుంచి నిరవధిక సమ్మె చేస్తామ ని ఆయన హెచ్చరించారు. కార్మికులు భయపడాల్సిన అవసరం లేదని, పర్మినెంట్ యూనియన్ నాయకులు, కార్మికులు సమ్మెలో పాల్గొనాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో కార్మిక సంఘం ముఖ్య సలహాదారు బత్తిని సతశ్‌గౌడ్, నాయకులు సంపత్, దాడి బాపు, బైరి రామకృష్ణ, మల్కనూరి శ్రీధర్, కుర్ర మల్లయ్య, సాదిక్‌పాషా, కొప్పుల మల్లేశ్, ప్రసాద్, కొమురయ్య, కొమ్ము శ్రీనివాస్, అంజయ్య తదితరులు పాల్గొన్నారు.
పర్మినెంట్, కాంట్రాక్టు కార్మికులు అందరూ పాల్గొనాలి
యాజమాన్యం దిగి వచ్చేంత వరకూ విధుల బహిష్కరణ
కేశోరాం కాంట్రాక్టు కార్మిక సంఘం అధ్యక్షుడు కౌశిక హరి
Comments
Please login to add a commentAdd a comment