రేపటి వరకు ఏఎంఆర్ వారోత్సవాలు
పెద్దపల్లిరూరల్: ప్రపంచ యాంటీ మైక్రోబియల్ నిరోధికత(ఏఎంఆర్) వారోత్సవాలను ఈనెల 18 నుంచి 24వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు డీఎంహెచ్‌వో అన్నప్రసన్నకుమారి తెలిపారు. శుక్రవారం త న కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. యాంటీమైక్రోబియల్ నిరోధకతపై అవగాహన కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. అనంతరం ఆర్‌ఎంపీ, పీఎంపీలకు అవగాహన కల్పించారు. ప్రోగ్రాం అధికారులు సుధాకర్‌రెడ్డి, శ్రీరాములు, అజీజ్, శ్రీనివాస్, రవీందర్, శంకర్ తదితరులు ఉన్నారు.
వరి కొయ్యలను నేలలోనే కలియ దున్నాలి
పెద్దపల్లిరూరల్: వరి కోతల అనంతరం అవశేషాలకు నిప్పు పెట్టొద్దని, వాటిని నేలలోనే కలియదున్నాలని జిల్లా వ్యవసాయాధికారి ఆదిరెడ్డి సూచించారు. నిప్పు పెట్టడం ద్వారా పర్యావరణానికి ము ప్పు వాటిల్లే ప్రమాదం ఉందన్నారు. గతంలో గడ్డిని కుప్పలుగా దాచుకుని పశువులకు మేతగా వాడుకునే వారని, కూలీల కొరత, హార్వెస్టర్ల వినియోగంతో గడ్డి కట్టలు కట్టేందుకు పనికిరాక అలాగే వదిలే సి అవశేషాలను కాలుస్తున్నారని వివరించారు. కానీ, వరికొయ్యలను నేలలో కలియ దున్నితే ఎకరాకి దాదాపు టన్ను ఎరువు తయారవుతుందని తెలిపారు. రొటోవేటర్‌తో దున్ని కొయ్యకాళ్లను చిన్నముక్కలుగా, పౌడర్‌గా మార్చవచ్చన్నారు.
Comments
Please login to add a commentAdd a comment