సోమవారం శ్రీ 3 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025
● ఈ నెల 7న నామినేషన్ వేయనున్న నరేందర్‌రెడ్డి ● తొలిరోజు నామినేషన్‌కు రవీందర్‌సింగ్ సన్నాహాలు ● ఇంకా అభ్యర్థులను ప్రకటించని బీఆర్‌ఎస్ ● ‘గులాబీ’ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రసన్న హరికృష్ణ?
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ఉమ్మడి కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల ఎమ్మెల్సీ నామినేషన్లకు రంగం సిద్ధమైంది. కరీంనగర్ కేంద్రంగా జరిగే ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు కలెక్టర్ పమేలా సత్పతి ఆర్‌వోగా వ్యహరిస్తారు. ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ సోమవారం వెలువడనుంది. నేటి నుంచి పదో తేదీ వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. 11న స్క్రూటినీ, 13వరకు నామినేషన్ల ఉపసంహరణ, 27న పోలింగ్, మార్చి 3న ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఈ మేరకు 15 జిల్లాలు, 42 నియోజకవర్గాలు ఎన్నికల కోడ్‌లోకి వచ్చాయి. ఆయా ప్రాంతాల నుంచి పలువురు నేతలు నామినేషన్ వేసేందుకు కరీంనగర్ రానున్నారు. ఈ మేరకు కలెక్టరేట్‌లో ఏర్పాట్లు పూర్తి చేశారు.
నేతల ఏర్పాట్లు..
అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత నరేందర్‌రెడ్డికి కాంగ్రెస్ టికెట్ ఇవ్వడంతో ఆయన ఈనెల 7న నామినేషన్ వేస్తారని సమాచారం. ఆ రోజు ఆయన కుటుంబసభ్యులు, కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి నగరంలో భారీ ర్యాలీ నిర్వహించనున్నారని తెలిసింది. పదో తేదీన నిర్వహించే మరో ర్యాలీలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, దామోదర రాజనరసింహ, పీసీసీ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్ గౌడ్ తదితర ముఖ్య నాయకులు పాల్గొననున్నారు. మరో అభ్యర్థి ప్రసన్న హరికృష్ణతో బీఆర్‌ఎస్ నేతలు మంతనాలు సాగిస్తున్నారని సమాచారం. ఆయన గులాబీ పార్టీలో చేరతారా? లేక స్వతంత్రంగా బరిలో ఉంటారా? అన్నది ఆసక్తికరంగా మారింది.
స్వతంత్రులుగా పలువురు
డా.బీఎన్.రావు, మాజీ మేయర్ రవీందర్‌సింగ్, ట్రస్మా మాజీ అధ్యక్షుడు యాదగిరి శేఖర్‌రావు స్వతంత్రులుగా బరిలో ఉంటారని సమాచారం. వీరిలో రవీందర్‌సింగ్, శేఖర్‌రావు ఉద్యమనాయకులు. అయినా తమకు మొండిచేయి చూపారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉస్మానియా ఉద్యమనేత నిజామాబాద్‌కు చెందిన రాజారాంయాదవ్‌కు కూడా ఈ విషయంలో నిరాశ మిగిలింది. బీజేపీ గ్రాడ్యుయేట్ అభ్యర్థి అంజిరెడ్డి, టీచర్ అభ్యర్థి మల్క కొమురయ్య నామినేషన్లకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. వీరి నామినేషన్లకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రితోపాటు మరికొందరు కీలక నేతలు హాజరవుతారు. ప్రభుత్వ అధ్యాపక జేఏసీ, ఎస్టీయూ టీఎస్, టీపీఆర్టీయూ బలపరిచిన ఉమ్మడి అభ్యర్థి, సిట్టింగ్ టీచర్ ఎమ్మెల్సీ కూర రఘోత్తమరెడ్డి కూడా రెండురోజుల్లో నామినేషన్ వేయనున్నారు. మానేరు విద్యా సంస్థల అధినేత కడారి అనంతరెడ్డి పోటీ చేసేందుకు ఏర్పాట్లు చేసుకున్నా.. బరిలో దిగే విషయంలో సందిగ్ధం నెలకొంది. అలాగే పీఆర్‌టీయూ బలపరిచిన వంగా మహేందర్‌రెడ్డి, ఎస్జీటీయూ నుంచి సంకినేని మాధవరావు కూడా బరిలో ఉన్నారు. టీపీటీఎఫ్, ఇతర ఉపాధ్యాయ సంఘాలు బలపరిచిన వై.అశోక్‌కుమార్ నామినేషన్‌కు ఏర్పాటు చేసుకుంటున్నారు. వీరి భవితవ్యాన్ని 3,58,614 మంది గ్రాడ్యుయేట్లు, 28,672 మంది టీచర్లు నిర్ణయించనున్నారు.
అర్హులకు న్యాయం
ఓదెల(పెద్దపల్లి): అర్హులందరికీ సంక్షేమ ఫ లాలు అందుతాయని ఎమ్మెల్యే విజయరమణరావు అన్నారు. గుండ్లపల్లి, కనగర్తి, మడక, రూపునారాయణపేట, జీలకుంటలో ఎమ్మె ల్యే ఆదివారం పర్యటించారు. పెండింగ్ స మస్యలను తన దృష్టికి తీసుకొస్తే వెంటనే పరిష్కారిస్తానని అన్నారు. పెద్దపల్లి వ్యవసా య మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ ఈర్ల స్వరూ ప, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మూల ప్రేంసాగర్‌రెడ్డి, పొత్కపల్లి సింగిల్‌విండో చైర్మన్ ఆళ్ల సుమన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఈనెల 3న నోటిఫికేషన్ విడుదల
10న నామినేషన్ల చివరితేదీ
11న నామినేషన్ల స్క్రూటినీ
13న విత్‌డ్రాలకు చివరితేదీ
27న పోలింగ్
మార్చి 3న ఓట్ల లెక్కింపు
08న ఎన్నికల ప్రక్రియ పూర్తి
న్యూస్‌రీల్
ఎమ్మెల్సీ నామినేషన్లకు
వేళాయే..!
షెడ్యూల్ ఇలా..
నామినేషన్ల స్వీకరణకు ఏర్పాట్లు పూర్తి
కరీంనగర్ అర్బన్: నామినేషన్లను దాఖలు చేసేందుకు వచ్చే అభ్యర్థుల సహాయార్థం కరీంనగర్ కలెక్టరేట్ ప్రధాన ద్వారంలో హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేశారు. తహసీల్దార్ స్థాయి అధికారులు సేవలు అందించనున్నారు. కలెక్టరేట్ చిరునామా తెలిపేలా బస్టాండ్ నుంచి కలెక్టరేట్ వరకు బోర్డులను ఏర్పాటు చేశారు. కలెక్టరేట్ ఏవో గడ్డం సుధాకర్ దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షించారు.
Comments
Please login to add a commentAdd a comment