5న దేశవ్యాప్త నిరసన
పెద్దపల్లిరూరల్: కేంద్ర ప్రభుత్వం పారిశ్రామిక రంగాన్ని ప్రైవేటీకరించేందుకు కుట్ర పన్నుతోందని సీఐటీయూ జిల్లా కార్యదర్శి ముత్యంరావు ఆరోపించారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో నాయకులు కడా రి సునీల్, బూడిద గణేశ్‌తో కలిసి ఆయన ఆదివారం విలేకరులతో మాట్లాడారు. పారిశ్రామిక రంగాన్ని కార్పొరేట్ శక్తులకు అప్పగించేందుకు కేంద్రప్రభుత్వం కొత్త చట్టాలు రూపొందిస్తోందని విమర్శించారు. కేంద్రప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ ఈనెల 5న దేశవ్యాప్త నిరసన పాటించాలని వారు కోరారు. జిల్లా, పట్టణ, మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టి ప్రభుత్వ తీరును ఎండగట్టాలని వారు కోరారు. సమావేశంలో నాయకులు రవీందర్, తిరుపతి, పోచం, సతీశ్ తదితరులు పాల్గొన్నారు.
ఉత్కంఠగా క్రికెట్ పోటీలు
జ్యోతినగర్(రామగుండం): ఎన్టీపీసీ టెంప రరీ టౌన్‌షిప్ జెడ్పీ హైస్కూల్‌లో ఈఎండీ, సీఐ కార్మికుల మధ్య ఆదివారం స్నేహపూర్వ క క్రికెట్ పోటీలు నిర్వహించారు. విజేతగా నిలిచిన ఈఎండీ జట్టుకు తెలంగాణ ప్రాజెక్ట్ –1 వొల్టెక్ కంపెనీ సైట్ ఇన్‌చార్జి అరుణ్‌యాదవ్ బహుమతి అందజేశారు. ఆయన మా ట్లాడుతూ, క్రీడలతో మానసిక ఉల్లాసం కలుగుతుందన్నారు. వృత్తిరీత్యా నిత్యం బిజీగా ఉండే కార్మికుల మానసిక ఉల్లాసం కోసం క్రికెట్ పోటీలు నిర్వహించామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రతినిధులు విష్ణు, మహేశ్, సమీర్, శ్రీరామ్, అనిల్, రాజేశ్, విజయ్ తదితరులు పాల్గొన్నారు.
దరఖాస్తులు ఆహ్వానం
జ్యోతినగర్(రామగుండం): నిరుద్యోగ యు వతకు వివిధ ఉద్యోగాల్లో అర్హత సాధించేందుకు ఎన్టీపీసీ శిక్షణ ఇస్తోంది. ఇందుకోసం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. కాంపిటేటివ్ పరీక్షలకు సిద్ధమయ్యే వారికోసం సీఎస్సార్ –సీడీ, దీప్తి మహిళా సమితి ఆధ్వర్యంలో ఆర్నెల్లపాటు ఉచిత శిక్షణ ఇవ్వనుంది. ఆసక్తి గలవారు ఈనెల 3 – 6వ తేదీ వరకు దరఖాస్తులను మేడిపల్లి సెంటర్‌లోని లైఫ్‌స్కిల్ అకాడమీలో స్వీకరిస్తారు. వివరాల కోసం 77801 97368, 79813 67855, 81060 44670 నంబర్లలో సంప్రదించాలి.
7న నిరసన ప్రదర్శన
కాల్వశ్రీరాంపూర్(పెద్దపల్లి): ఎస్సీ వర్గీకరణ పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వెంటనే అ మలు చేయాలనే డిమాండ్‌తో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో ఆదివారం డప్పులతో ప్రదర్శన, ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వం కళ్లు తెరిపించాలని కోరుతూ అంబేడ్కర్ విగ్రహానికి వినతిప్రతం అందజేశా రు. వర్గీకరణ అమలు చేయాలనే డిమాండ్ తో ఈనెల 7న హైదరాబాద్‌లో చేపట్టే లక్ష డ ప్పులు, వేలాది గొంతులతో సాంస్కృతిక కా ర్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరా రు. ప్రతినిధులు రామంచ భరత్, లంక సద య్య, తూండ్ల రాజయ్య, మధునయ్య, పు ల్లూరి సాగర్, రాజయ్య, దంతెనపెల్లి స్వా మి, ఉమామహేశ్వర్, కండె శ్రీశైలం, రామస్వామి, తిరుపతి, అజయ్ పాల్గొన్నారు.
బహుమతి అందిస్తున్న అరుణ్ యాదవ్
Comments
Please login to add a commentAdd a comment