తెలంగాణపై కేంద్రం వివక్ష
గోదావరిఖని: బడ్జెట్‌లో రాష్ట్రంపై కేంద్రప్రభుత్వం వివక్ష ప్రదర్శించిందని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్ విమర్శించారు. ఈమేరకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక ప్రధాన చౌరస్తాలో ఆదివారం ధర్నా నిర్వహించారు. ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్ మాట్లాడుతూ, తెలంగాణ ప్రాజెక్టులకు బడ్జెట్ కేటాయింపుల్లో అన్నివిధాలా అన్యాయమే జరిగిందన్నారు. ఇప్పటికైనా కేంద్రప్రభుత్వం స్పందించి రాష్ట్రానికి అవసరమైన నిధులు కేటాయించి న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మహంకాళి స్వామి, దీటి బాలరాజు, మారెల్లి రాజిరెడ్డి, తిప్పారపు శ్రీనివాస్, బదావత్ శంకర్‌నాయక్, పెద్దెల్లి ప్రకాశ్, ముస్తాఫా, కొలిపాక సుజాత, గుండేటి రాజేశ్ తదితరులు పాల్గొన్నారు.
సమస్యలు పరిష్కరించాలి
జీడీకే–5 ఓసీపీలో కార్మికుల సమస్యలను పరిష్క రించాలని ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్ సూచించారు. హై దరాబాద్‌లో ఐఎన్‌టీయూసీ నాయకులు ఎమ్మెల్యే ను కలిసి సమస్యలు వివరించారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే.. ఆర్జీ–1 జీఎం లలిత్‌కుమార్‌తో ఫోన్‌లో మాట్లాడారు. కార్మికులకు సమస్యలు ఎదురైతే చూస్తూ ఊరుకోబోమన్నారు. మూడు రోజుల క్రితం క్యాంటీన్ విషయంలో తలెత్తిన సమస్యపై ఐఎన్‌టీయూసీ నాయకులకు అధికారులు నోటీసులు జారీచేయడం సరికాదన్నారు. నోటీసులను వెంటనే ఉపసంహరించుకోవాలని ఆయన సూచించారు. ఎమ్మెల్యేను కలిసిన వారిలో నాయకులు జనగామ శ్రీనివాస్, కృష్ణ తదితరులు ఉన్నారు.
రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్
Comments
Please login to add a commentAdd a comment