పెరిగిన యూరియా ఉత్పత్తి
ఫెర్టిలైజర్‌సిటీ(రామగుండం): ఆర్‌ఎఫ్‌సీఎల్‌లో యూరియా ఉత్పత్తి భారీగా పెరిగింది. ఈనెలలో 1,10,604.33 మెట్రిక్ టన్నుల నీంకోటెడ్ యూరియా ఉత్పత్తి చేసినట్లు కర్మాగారం సీఈవో ఉదయ్ రాజహంస తెలిపారు. ఈ మేరకు ఆయన శనివారం విలేకరుల సమావేశంలో మాటాలారు. కర్మాగారంలో ఉత్పత్తి చేసిన యూరియాను తెలంగాణతోపాటు ఆరు రాష్ట్రాలకు సరఫరా చేస్తున్నామని ఆయన అన్నారు. తెలంగాణకు 54,555.30 మెట్రిక్ టన్నులు, ఆంధ్రప్రదేశ్‌కు 30,377.25 మెట్రిక్ టన్నులు, కర్ణాటకకు 8,734.68 మెట్రిక్ టన్నులు, మహారాష్ట్రకు 2,623.59 మెట్రిక్ టన్నులు, ఛత్తీస్‌గఢ్‌కు 5,643.72 మెట్రిక్ టన్నులు, తమిళనాడుకు 8,669.79 మెట్రిక్ టన్నుల యూరియా ఇప్పటికే సరఫరా చేశామని సీఈవో వివరించారు.
ఆర్‌ఎఫ్‌సీఎల్ సీఈవో ఉదయ్ రాజసింహ
Comments
Please login to add a commentAdd a comment