మధ్య తరగతికి మేలు
పెద్దపల్లిరూరల్: మధ్యతరగతి ఉద్యోగులకు ఆదాయపుపన్ను నుంచి మినహాయింపు ఇవ్వడం మేలు కలిగించినట్లయ్యింది. రూ.లక్షలోపు సంపాదించే ఉద్యోగికి మూడు లక్షల సీలింగ్ విభాగాన్ని రూ.నాలుగు లక్షలకు పెంచడాన్ని స్వాగతిస్తున్నాం.
– బొంకూరి శంకర్,
జిల్లా అధ్యక్షుడు, టీఎన్జీవోస్
ఎంపీలు ఏం చేశారు?
పెద్దపల్లిరూరల్: అధికార పార్టీకి చెందిన ఎనిమిది మంది ఎంపీలు పార్లమెంట్‌లో ఉండి ఏంలాభం? బడ్జెట్‌లో రాష్ట్రానికి ఏంసాధించలేకపోయారు. కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామ్యమైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికే పెద్దపీట వేశారు.
– ఈద శంకర్‌రెడ్డి, మాజీ చైర్మన్, ఐడీసీ
కార్మిక వ్యతిరేకం
పెద్దపల్లిరూరల్: కేంద్ర బడ్జెట్‌లో కార్మిక సంక్షేమానికి ప్రాధాన్యత కరువైంది. ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్లకు అప్పగించేందుకు కేంద్రప్రభుత్వం చేస్తున్న కుట్ర బడ్జెట్‌లో స్పష్టంగా కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ విభజన హామీల ప్రకారం రాష్ట్రానికి కేంద్రప్రభుత్వం బడ్జెట్‌లో నిధులు కేటాయించకపోవడం అన్యాయం.
– ముత్యంరావు,
జిల్లా కార్యదర్శి, సీఐటీయూ
Comments
Please login to add a commentAdd a comment