డాక్యుమెంట్ రైటర్ల నిరసన
రామగుండం: మూడు నెలల క్రితం పట్టణంలో ఏర్పాటు చేసిన సబ్ రిజిష్ట్రేషన్ కార్యాలయంలో స్థానిక, స్థానికేతర డాక్యుమెంట్ రైటర్ల మధ్య కోల్డ్‌వార్ నడుస్తోంది. స్థానికేతరులు ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని స్థానికులు కొంతకాలంగా డిమాండ్ చేస్తూ వస్తున్నారు. అయినా, వారు ససేమిరా అనడంతో శనివారం స్థానికులు ఏకంగా ప్రత్యక్ష ఆందోళనకు దిగారు. తమ పనులు బహిష్కరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా స్థానిక డాక్యు మెంట్ రైటర్లు మాట్లాడుతూ రామగుండంలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఏర్పాటుకు ముందే స్థానికేతరులు ఇక్కడ కార్యాలయాలు ఏర్పాటు చేశారన్నా రు. ఇందుకోసం రూ.లక్షల అడ్వాన్సు చెల్లించారని, షెట్టర్లను తెరిచి స్థానికుల ఉపాధిని దెబ్బతీసేలా కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. అదేవిధంగా సబ్ రిజిస్ట్ట్రార్ కార్యాలయంలోని అధికారులను మచ్చిక చేసుకొని స్థానికేతర రైటర్లు తమకు ఉపాధి దొరకకుండా చేస్తున్నారని వారు దుయ్యబట్టారు.
Comments
Please login to add a commentAdd a comment