తాగునీటి సమస్య ఎక్కడుంది?
సుల్తానాబాద్(పెద్దపల్లి): వేసవిలో తాగునీటి సమస్య తలెత్తకుండా పంచాయతీరాజ్ ఇంజినీర్లు, అధికారులు, శుక్రవారం పల్లెబాట పట్టారు. మంచినీటి, బోరుబావులు, మిషన్ భగీరథ పైపులైన్లు పరిశీలించారు. తాగునీటి సరఫరాలో లోపాలు తనిఖీ చేశారు. పైపులైన్ల ద్వారా నీటిసరఫరాలో సమస్య తలెత్తితే విద్యుత్ మోటార్లు సిద్ధంగా ఉన్నాయా, పైపులైన్లు సక్రమంగా ఉన్నాయా? అనే అంశాలు తెలుసుకునేందుకు సర్వే చేస్తున్నారు. జిల్లాలోని 13 మండలాల్లో గల 269 గ్రామాల్లో క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్న అధికారులు.. తాము గుర్తించిన సమస్యలు, ప్రత్యామ్నాయ మార్గాలపై నివేదిక తయారుచేసి ఉన్నతాధికారులకు అందజేస్తారు.
సిబ్బందికి శిక్షణ
గ్రామాల్లోని తాగునీటి సరఫరా విభాగంలో పనిచేసే ఉద్యోగులకు గతేడాది వేసవిలోనే శిక్షణ ఇచ్చారు. నీటి సరఫరా తీరు, లీకేజీలను నియంత్రించడం, అవసరమైన చోట పైపులైన్లు నిర్మించడంపై మెలకులవలు నేర్పించారు.
బోరు నుంచి నీరు వస్తుందా?
పైపులైన్లు సరిగా ఉన్నాయా?
క్షేత్రస్థాయిలో ఆరా తీస్తున్న అధికారులు
వేసవిలో తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు
సమస్యపై నివేదిక
వేసవిలో తాగునీటికి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన చర్యలు తీసుకుంటాం. ఇందుకోసం గ్రామాల్లో సర్వే ప్రారంభించాం. ఈనెల 10వ తేదీ వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. ఎంపీడీవోలు, ఎంపీవోలు, పంచాయతీ కార్యదర్శులు, ఆర్‌డబ్ల్యూఎస్, పీఆర్ తదితర విభాగాల అధికారులు సర్వేలో సమస్యలు గుర్తించి నివేదిక రూపొందిస్తారు. ఇది మండలం నుంచి డివిజన్‌కు, అక్కడి నుంచి జిల్లా, చివరకు ప్రభుత్వానికి చేరుతుంది. సర్కారు ఆదేశాల మేరకు సమస్యలు పరిష్కరిస్తాం.
– శ్రీనివాస్, ఈఈ, పీఆర్
Comments
Please login to add a commentAdd a comment