సమస్యలు ఉంటే చెప్పండి
పెద్దపల్లిరూరల్: ‘ప్రజాసేవకుడిగా మీ ముందుకొచ్చా.. గ్రామంలో సమస్యలేమైనా ఉంటే నాతో చెప్పండి.. పరిష్కరిస్తా’ అని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. కనగర్తి, కాపులపల్లిలో శనివారం ఆయన పర్యటించారు. వివిధ అంశాలపై స్థానికులతో ముచ్చటించారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ అభివృద్ధికి పాటుపడతానని హామీ ఇచ్చారు. ఆయన వెంట పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ ఈర్ల స్వరూప, వైస్‌చైర్మన్ మల్లారెడ్డి, నాయకులు ఎడెల్లి శంకర్, ఇనుగాల తిరుపతిరెడ్డి, రాజయ్య, సంపత్, నరేశ్, రాజు, స్వామి, పోచాలు తదితరులు ఉన్నారు.
సమస్యలపై ప్రత్యేక దృష్టి
ఎలిగేడు(పెద్దపల్లి): గత పాలకుల నిర్లక్ష్యంతో గ్రామాల్లో పేరుకు పోయిన సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారిస్తామని ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. నర్సాపూర్, ధూళికట్ట, ఎలిగేడు, బుర్హాన్‌మియాపేట గ్రామాల్లో ఎమ్మెల్యే పర్యటించారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడిన బురాహాన్‌మియాపేటకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు దామోదర్‌రెడ్డిని ఎమ్మెల్యే పరామర్శించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ, గత పాలకులతోనే నియోజకవర్గం అభివృద్ధికి దూరంగా ఉండిపోయిందని ఆరోపించారు. నాయకులు సామ రాజేశ్వర్‌రెడ్డి, దుగ్యాల సంతోష్‌రావు, సింధూజ, వెంకటేశ్వర్‌రావు, వామన్‌రావు, పరుశురాములుగౌడ్, తిరుపతిగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే విజయరమణారావు
Comments
Please login to add a commentAdd a comment