గోదావరిఖని: రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఆపరేషన్ స్మైల్ ద్వారా 88 మంది బాల, బాలికలను గుర్తించినట్లు పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ వెల్లడించారు. ఈ ఏడాది జనవరి 1 నుంచి 31వ తేదీ వరకు ఆపరేషన్ స్మైల్–11 కార్యక్రమా న్ని కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల్లో విజయవంతం చేశామని వివరించారు. పెద్దపల్లి జిల్లాలో 14మందిని గుర్తించగా, అందులో బాలురు 11 మంది, బాలికలు ముగ్గురు ఉన్నారని తెలిపారు. ఈమేరకు రెండు కేసులు నమోదు చేసి నలుగురు బాలకార్మికులకు విముక్తి కల్పించి పాఠశాలల్లో చేర్పించామన్నారు. అదేవిధంగా మంచిర్యాల జిల్లాలో 74 మందిని గుర్తించామని, ఇందులో బాలురు 55మంది, బాలికలు 19 మంది ఉన్నారని అన్నారు. ఒక కేసు నమోదు చేసి ఇద్దరిని పాఠశాలల్లో చేర్పించామని సీపీ వివరించారు.
నిషేధాజ్జల పొడిగింపు
సాధారణ పౌరులు, ప్రధానంగా మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని కమిషనరేట్‌లోని మంచిర్యాల, పెద్దపల్లి జోన్ల బహి రంగ ప్రదేశాల్లో మద్యపానంపై అమల్లో ఉన్న నిషే ధాజ్ఞలను మార్చి 1వ తేదీ వరకు పొడిగిస్తున్నామని పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ తెలిపారు. మద్యం ప్రియుల ఆగడాలపై ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. అలాగే, డీజే సౌండ్, డ్రోన్‌లపై నిషేధాజ్ఞలు ఏడాదిపాటు కొనసాగుతాయని ఆయన పేర్కొన్నారు. అలాగే సిటీ పోలీస్‌యాక్ట్ అమలులో ఉంటుందన్నారు.
రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్
Comments
Please login to add a commentAdd a comment