
AP Elections Political Latest Updates Telugu..
09:15 PM, Jan 31 2024
వాళ్లు దేనికి సిద్ధం?: సజ్జల కౌంటర్
- వైఎస్సార్‌సీపీ సిద్దం నినాదంపై ప్రతిపక్షాల విద్వేష వ్యాఖ్యలు
- కౌంటర్ ఇచ్చిన వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి
- 175 స్థానాల్లో మేం పోటీ చేస్తున్నాం
- 175 స్థానాలకు పోటీ చేయలేని వారు.. మందలుగా తప్ప కలిసిరాలేనివాళ్లు దేనికి సిద్ధం?
- టీడీపీ జనసేనవి అర్థం లేని మాటలు
- జనసేన, టీడీపీ ఎన్ని స్థానాల్లో సిద్ధం?
09:00 PM, Jan 31 2024
వైఎస్సార్‌సీపీ ఐదో జాబితా విడుదల
- మార్పులు చేర్పులతో మరో జాబితా విడుదల చేసిన వైఎస్సార్సీపీ
- ప్రకటించిన మంత్రి బొత్స, సజ్జల
- నాలుగు ఎంపీ స్థానాలకు, మూడు ఎమ్మెల్యే నియోజకవర్గాలకు సమన్వయకర్తల్ని మార్చేసిన వైఎస్సార్‌సీపీ
- రీజినల్ కో ఆర్డినేటర్ విజయసాయిరెడ్డికి అదనంగా గుంటూరు పార్లమెంట్ బాధ్యతలు
- చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి ఒంగోలు పార్లమెంట్ బాధ్యతలు.. అదనంగా కందుకూరు, సంతనూతలపాడు, కావలి అసెంబ్లీ నియోజకవర్గాలకు రీజినల్ కోఆర్డినేటర్‌గా నియామకం
08:00 PM, Jan 31 2024
లోకేష్‌ను మడత పెట్టడం ఖాయం
- మంగళగిరి నియోజకవర్గం లో వైఎస్సార్‌సీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర
- నియోజకవర్గ ఇన్‌ఛార్జి గంజి చిరంజీవి ఆధ్వర్యంలో జరిగిన యాత్ర
- బస్టాండ్ సెంటర్ నుంచి గాలిగోపురం మెయిన్ బజార్ మీదుగా మార్కెట్ సెంటర్‌కు
- మార్కెట్ సెంటర్‌లో భారీ బహిరంగ సభ.. హాజరైన అశేష జనం
- సభకు హాజరైన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజా ప్రతినిధులతో పాటు మంత్రులు
- మంగళగిరిలో బీసీలను టీడీపీ తొక్కేస్తూ వస్తోంది
- బీసీలకు కాదని నారా లోకేష్‌కు సీటు కేటాయిస్తోంది
- సామాజిక న్యాయంలో భాగంగానే బీసీ అభ్యర్థి చిరంజీవికి వైఎస్సార్‌సీపీ సీటు కేటాయింపు
- వేదిక నుంచి నారా లోకేష్‌ను ర్యాగింగ్ చేసిన వైఎస్సార్‌సీపీ నేతలు
- సరిగ్గా మంగళగిరి అని పలకడం కూడా లోకేష్‌కు రాదు
- లోకేష్ తన దగ్గర ఉన్న డబ్బులతో మంగళగిరి ప్రజల్ని కొనేయాలనుకుంటున్నాడు
- లోకేష్‌ను వైఎస్సార్సీపీ మడతపెట్టడం ఖాయం
- వైఎస్సార్‌సీపీ దెబ్బకు లోకేష్ పారిపోతాడు
- 2019లాగే.. 2024లో మరోసారి లోకేష్‌ను ఓడించాలని మంగళగిరి ప్రజలకు పిలుపు
- వెనుకబడిన వర్గానికి చెందిన గంజి చిరంజీవిని గెలిపించుకోవాలని పిలుపు
- 175 స్థానాలకు 175 స్థానాలు వైఎస్సార్‌సీపీ గెలుపొందుతుందని నేతల్లో ధీమా
07:23 PM, Jan 31 2024
ఐదో జాబితాపై పూర్తైన కసరత్తు
- వైనాట్ 175 నినాదంతో ఎన్నికలకు సిద్ధం అవుతున్న వైఎస్సార్‌సీపీ
- ఈ క్రమంలోనే మార్పులు చేర్పులు చేస్తున్న అధ్యక్షుడు.. సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
- క్షేత్రస్థాయి పరిస్థితులు.. సామాజిక సమీకరణాల దృష్ట్యానే మార్పులు
- సీఎం క్యాంప్ కార్యాలయానికి వెళ్లిన చర్చలు జరిపిన కీలక నేతలు
- కాసేపట్లో వైఎస్సార్‌సీపీ ఐదో జాబితా విడుదలకు అవకాశం
- ఇప్పటికే నాలుగు జాబితాలు విడుదల చేసిన పార్టీ
- ఇప్పటికే 68 అసెంబ్లీతో పాటు పలు లోక్‌సభ స్థానాలకు మార్పులు చేసిన వైఎస్సార్‌సీపీ
07:18 PM, Jan 31 2024
తప్పుడు ప్రచారంపై లీగల్ చర్యలకు వెళ్తా: ఎమ్మెల్యే కాటసాని
- పచ్చ మంద ప్రచారంపై పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి ఫైర్
- పాణ్యం నియోజకవర్గపు టీడీపీ పార్టీ నేతలపై మండిపడిన కాటసాని..
- టీడీపీ పార్టీ చెందిన గౌరు చరితారెడ్డి, గౌరు వెంకటరెడ్డి పై అసత్య ఆరోపణలపై ఎలక్షన్ కమిషన్‌కు ఫిర్యాదు చేస్తా
- ఎల్లో మీడియా, సోషల్ మీడియాలో తనపై భూకబ్జాలకు పాల్పడని ప్రచారం చేయడం సరైంది కాదు
- తన పై చేసిన భూముల కబ్జాల ఆరోపణలపై కలెక్టర్ కు ఫిర్యాదు చేసి విచారణ నిరూపించాలి, లేదంటే వారి పై న్యాయపరమైన చర్యలకు ఉపక్రమిస్తా
06:35 PM, Jan 31 2024
వైఎస్సార్‌సీపీలో చేరిన రిటైర్డ్ ఐఆర్‌ఎస్ ఆఫీసర్ విల్సన్
- దేశ చరిత్రలో వైఎస్ఆర్ తర్వాత వైఎస్ జగన్ మాత్రమే పేదల కోసం పని చేస్తున్నారు
- పేదల అభ్యన్నతికి ఆకర్షితుడినై జగన్ సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరాను
- జగన్ ఎలాంటి పని అప్పగించినా చేస్తాను
- వైఎస్సార్‌సీపీకి, జగన్ కి రుణపడి ఉంటాను
- చుక్కా విల్సన్ బాబు, రిటైర్డు ఐఆర్ఎస్ ఆఫీసర్ వ్యాఖ్యలు
06:02 PM, Jan 31 2024
ఒంటరి పోరు దిశగా బీజేపీ ఇంకా ముందుకు..
- నేడు 25 పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఎన్నికల కార్యాయాల్ని ప్రారంభించిన బీజేపీ
- కొన్ని చోట్ల అసెంబ్లీ నియోజకవర్గాల కార్యాలయాల ప్రారంభం కూడా
- అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా విడిగా మేనేజ్‌మెంట్ కమిటీల ఏర్పాటు
- జాతీయ నాయకత్వం సూచనల మేరకు దూకుడు పెంచిన ఏపీ బీజేపీ
- కోర్ కమిటీ మీటింగ్‌లో నియోజకవర్గాల వారీగా పార్టీ పడే అవకాశం ఉన్న ఓట్లపై సమగ్ర చర్చ
- లోక్‌సభ నియోజకవర్గాల వారీగా ప్రతిపాదిత అభ్యర్థుల జాబితా సిద్ధం
- పురందేశ్వరి సహా ముఖ్య నాయకులందరికీ పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా ఎన్నికల బాధ్యత
05:50 PM, Jan 31 2024
మార్టూరులో ఉన్నవన్నీ టీడీపీవాళ్ల పరిశ్రమలే: ఆమంచి కృష్ణమోహన్
- పచ్చపత్రికలు తప్పుడు వార్తలతో మీడియా వ్యభిచారం చేస్తున్నాయి
- మాఫియాతో గ్రానైట్ ఫ్యాక్టరీలపై దాడులనడం అవాస్తవం
- అక్రమాలు జరిగితే తనిఖీలు చేసే అధికారం అధికారులకు ఉంటుంది
- ఫ్యాక్టరీల వల్ల లబ్ధి పొందుతున్నది ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు
- మార్టూరులో ఉన్నవన్నీ టీడీపీవాళ్ల పరిశ్రమలే
- మార్టూరు విలేకరుల సమావేశంలో వైఎస్సార్‌సీపీ ఇన్‌ఛార్జి ఆమంచి కృష్ణమోహన్ వ్యాఖ్యలు
05:19 PM, Jan 31 2024
వైఎస్సార్‌సీపీలో చేరిన రావెల కిషోర్ బాబు
- వైఎస్సార్‌సీపీలో చేరిన ప్రత్తిపాడు మాజీ ఎమ్మెల్యే రావెల కిషోర్ బాబు
- సీఎం జగన్ సమక్షంలో చేరిక
- వైఎస్సార్‌సీపీలో చేరడం సంతోషంగా ఉంది: రావెల
- అంబేద్కర్ కలలను సాకారం చేస్తున్న వ్యక్తి సీఎం జగన్
- సీఎం జగన్ పాలనలోనే అన్ని వర్గాలకు మంచి జరిగింది: రావెల
- వెనుకబడిన వర్గాలకు న్యాయం చేసిన ఘనత జగన్‌ది: రావెల
05:00 PM, Jan 31 2024
ఆ నలుగురికి మళ్లీ నోటీసులు
- వైఎస్సార్‌సీపీ నుంచి ఫిరాయించిన ఎమ్మెల్యేలకు మరోసారి అసెంబ్లీ స్పీకర్ నోటీసులు
- ఉండవల్లి శ్రీదేవి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఆనం రాంనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి నోటీసులు పంపిన శాసనసభ అధికారులు
- ఫిబ్రవరి 5 లోపు నోటీసులపై లిఖిత పూర్వకంగా సమాధానం ఇవ్వాలని కోరిన స్పీకర్
- ఫిబ్రవరి 8 తేదీ ఉదయం 11 గంటలకు స్పీకర్ ముందు విచారణకు హాజరు కావాలని ఆదేశం
- మంగళవారం సాయంత్రం నోటీసులు పంపిన స్పీకర్ కార్యాలయం
- వివరణ విషయంలో వాళ్లు సీరియస్‌గా లేకపోవడంతో.. బుధవారం కూడా మరోసారి నోటీసుల పంపిణీ!
- ప్రభుత్వ చీఫ్ విప్ ప్రసాదరాజు అనర్హత పిటిషన్ నేపథ్యంలో వివరణ కోరిన స్పీకర్ తమ్మినేని సీతారాం
- గత విచారణలో గడువు కోరిన ఎమ్మెల్యేలు
- ప్రసాదరాజు సమక్షంలోనే ఆ నలుగురిని ప్రశ్నించనున్న స్పీకర్
- వివరణ తర్వాతే అనర్హత వేటుపై నిర్ణయం వెల్లడించే అవకాశం
04:15 PM, Jan 31 2024
ఇంతకీ పోటీ ఎక్కడ పవనూ?
- ఈ ఎన్నికల్లో పోటీ చేయనున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్!
- పోటీ ఎక్కడి నుంచి అనేదానిపై లేని క్లారిటీ
- జనసేనాని పోటీ ఎక్కడి నుంచో అని జనసేన శ్రేణుల్లో ఉత్కంఠ
- గత ఎన్నికల్లో రెండు స్థానాల నుంచి పవన్ పోటీ
- రెండింటిలోనూ ఓడిన పవన్ కల్యాణ్
- గాజువాక, భీమవరంలలో ఓడిపోవడానికి టీడీపే కారణమంటూ అప్పట్లో మండిపడ్డ జనసైనికులు
- పొత్తు వంకతో ఇప్పటికే అభ్యర్థుల్ని ప్రకటించుకుంటూ పోతున్న టీడీపీ
- పొత్తు ధర్మం పక్కనపెట్టినందుకు కౌంటర్ రియాక్షన్ ఇవ్వాలంటూ పవన్‌పై ఒత్తిడి
- ఈ క్రమంలోనే రెండు స్థానాల ప్రకటన
- అయినా లెక్క చేయని టీడీపీ అధినేత చంద్రబాబు
04:00 PM, Jan 31 2024
మెగా డీఎస్సీ ఆమోదంపై డిప్యూటీ సీఎం ఏమన్నారంటే..
- గతంలో ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి అని చంద్రబాబు యువతను మోసం చేశారు
- కానీ, నిరుద్యోగులకు సీఎం జగన్ పండగ లాంటి నిర్ణయం తీసుకున్నారు
- 6100 టీచర్ పోస్టులకు కేబినెట్లో ఆమోదించాం
- చంద్రబాబు గత 5 ఏళ్లలో ఒక్క టీచర్ ఉద్యోగం భర్తీ చెయ్యలేదు
- ఇప్పటికే 14 వేల టీచింగ్ పోస్టులు భర్తీ చేశాం
- ఇప్పుడు మళ్లీ 6100 పోస్టులు భర్తీ చేస్తాం
- 2 లక్షల 9 వేల శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన ఏకైక సీఎం వై ఎస్ జగన్
కేబినెట్‌లో డిఎస్సీ ఆమోద నిర్ణయంపై డిప్యూటీ సీఎం రాజన్న దొర వ్యాఖ్యలు
03:30 PM, Jan 31 2024
ఏలూరులో 3న సిద్ధం.. పోస్టర్ ఆవిష్కరణ
- వైఎస్సార్‌సీపీ ఎన్నికల శంఖారావం
- ఏలూరు జిల్లా దెందులూరు సహారా మైదానంలో ఫిబ్రవరి 3న సిద్ధం
- భారీ బహిరంగ సభలో ప్రసంగించనున్న సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి
- దెందులూరు సిద్ధం సభ పోస్టర్ ఆవిష్కరణ
- హాజరైన ఉభయగోదావరి జిల్లాల రీజినల్ కోఆర్డినేటర్ ఎంపీ మిధున్ రెడ్డి, సీఎం ప్రోగ్రాం కో-ఆర్డినేటర్, ఎమ్మెల్సీ తలశిల రఘురాం, వైఎస్ఆర్సిపీ ఏలూరు జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యే ఆళ్ల నాని తదితరులు
- పోస్టర్ ఆవిష్కరణలో పాల్గొన్న దెందులూరు ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి ,ఏలూరు పార్లమెంట్ ఇంఛార్జ్ కారుమూరి సునీల్ కుమార్ ,చింతలపూడి ఇంఛార్జ్ కంభం విజయ్ రాజు , వైఎస్‌ఆర్సీపీ శ్రేణులు
02:48 PM, Jan 31 2024
అబద్ధానికి మరో పేరు చంద్రబాబు: మంత్రి చెల్లుబోయిన
- పేదలకు మంచి చేసిన వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి
- పేదలను మోసం చేసిన చంద్రబాబుతో పవన్ పొత్తు పెట్టుకున్నాడు
- అబద్ధానికి మరో పేరు చంద్రబాబు
- అలాంటి చంద్రబాబుకు పవన్ మద్దతిస్తున్నాడు
- పార్టీ పెట్టి... 14 ఏళ్ల నుంచి ప్రజలను మోసం చేసిన వ్యక్తి పవన్ కల్యాణ్
- బీసీ కులగణనను తప్పుబడుతున్నారు
- చంద్రబాబు అడగలేకే.. పవన్ తో అడిగించాడు
- బోలెడన్ని పుస్తకాలు చదివిన పవన్ కల్యాణ్ కుట్రలకు కుతంత్రాలకు నిలయమైన చంద్రబాబుకు ఆసరాగా నిలవడం సిగ్గుచేటు
- ఎన్నికల ముందు పవన్, చంద్రబాబు కుటిలతత్వం బయటపడింది
02:22 PM, Jan 31 2024
చంద్రబాబును ఏనాడో పార్శిల్ చేసేశారు
- చంద్రబాబుకు మాజీ మంత్రి కొడాలి నాని కౌంటర్
- తాను తలుపులు తెరిస్తే.. వైసీపీ ఖాళీ అవుతుందని చంద్రబాబు అంటున్నారు
- చంద్రబాబు తలుపుల్ని 2019లోనే హైదరాబాద్కు ఏపీ ప్రజలు పార్శిల్ చేశారు
- ఇప్పుడు బాబు చేసేదేమీ లేదు
01:57 PM, Jan 31 2024
జమ్మలమడుగులో వైఎస్సార్‌సీపీ శ్రేణులపై టీడీపీ రాళ్ల దాడి
- మద్దనూరులో ఉద్రిక్త పరిస్థితి
- వైఎస్సార్‌సీపీ నేత మునిరాజరెడ్డి వర్గీయులపై టీడీపీరాళ్ల దాడి
- టీడీపీ నేత భూపేష్‌రెడ్డి ఆదేశాలతో రెచ్చిపోయిన టీడీపీ శ్రేణులు
- దేవగుడి నుంచి మద్దనూరుకి భారీగా చేరుకున్న భూపేష్‌రెడ్డి అనుచరులు
- అధికార పార్టీ నేత మునిరాజరెడ్డి లక్ష్యంగా రాళ్లదాడులకు దిగిన టీడీపీ శ్రేణులు
01:51 PM, Jan 31 2024
ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు..
- డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలకు గ్రీన్‌సిగ్నల్
- 6,100 పోస్టులతో డీఎస్సీ నిర్వహణకు కేబినెట్ ఆమోదం
- వైఎస్సార్ చేయూత 4వ విడతకు ఆమోదం
- ఫిబ్రవరిలో వైఎస్సార్ చేయూత నిధులు విడుదల
- ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు రూ.5వేల కోట్ల నిధుల విడుదలకు ఆమోదం
- ఎస్‌ఐపీబీ ఆమోదించిన తీర్మానాలకు గ్రీన్ సిగ్నల్
- ఇంధన రంగంలో 22 వేల కోట్ల పెట్టుబడుల ప్రాతిపాదనలకు ఆమోదం
- ప్రతి గ్రామ పంచాయతీకి పంచాయతీ సెక్రటరీ ఉండాలన్న నిర్ణయానికి ఆమోదం
- ఎస్‌ఈఆర్టీలోకి ఐబీ భాగస్వామ్యానికి కేబినెట్ ఆమోదం
- యూనివర్శిటీలు, ఉన్నత విద్యా సంస్థల్లో పనిచేస్తున్న నాన్ టీచింగ్ సిబ్బంది పదవీ విరమణ వయసు 60 నుంచి 62కు పెంపు
- అటవీశాఖలో 689 పోస్టుల భర్తీకి కేబినెట్ ఆమోదం
- నంద్యాల, కర్నూలు జిల్లాల్లో రెండు విండ్ పవర్ ప్రాజెక్టులకు ఆమోదం
- శ్రీసత్యసాయి, అనంతపురం జిల్లాల్లో 600 మెగావాట్ల విండ్ పవర్ ప్రాజెక్ట్‌ల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం
- ఆర్జేయూకేటీకి రిజిస్ట్రార్ పోస్టు ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం
- ఆ మేరకు చట్టంలో సవరణకు కేబినెట్ ఆమోదం
01:24 PM, Jan 31 2024
చంద్రబాబు, షర్మిల పై కొడాలి నాని ఫైర్
- చంద్రబాబుకు మతిభ్రమించింది
- ప్రజలకు ఏం చేస్తారో చెప్పలేక జగన్ ను తిడుతున్నారు
- 2019లోనే చంద్రబాబును ప్రజలు హైదరాబాద్ కు పంపించేశారు
- సీట్లు రాని, మేం తీసేసిన వాళ్లు టీడీపీలో చేరుతున్నారు
- చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా కూడా రాదు
- కొత్త మేనిఫెస్టోతో చంద్రబాబుకు దిమ్మతిరిగేలా చేస్తాం
- పదవి కోసమే జగన్ పై షర్మిల నిందలు
- షర్మిల గతంలో తెలంగాణ కోసం పార్టీ పెట్టారు
- తెలంగాణాలో పాదయాత్ర చేసి ఏం చేసిందో అందరికీ తెలుసు
- వైఎస్ ఆశయాలు సాధిస్తానని షర్మిల ఏం చేసిందో అందరికీ తెలుసు
- ఏపీ కోసం పుట్టానని ఇప్పుడు షర్మిల చెబుతున్నారు
- షర్మిలకు స్టీల్ ప్లాంట్, పోలవరం ఇప్పుడు గుర్తొచ్చాయా? : కొడాలి నాని
12:10 PM, Jan 31 2024
బోండా ఉమను అసహ్యించుకుంటున్నారు: ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్
- బోండా ఉమ ఈ ప్రాంత అభివృద్ధిని విస్మరించాడు
- బుడమేరు మధ్యకట్ట ప్రజలు బోండా ఉమను అసహ్యించుకుంటున్నారు
- బోండా ఉమకు ప్రతి గుమ్మంలో నిరసన సెగ కనిపిస్తుంది
- 30వ డివిజన్‌లో కోట్ల రూపాయలు అభిృద్ధి పనులు చేపట్టాం
- సీఎం జగన్ పాలనను స్థానిక ప్రజలు కోరుకుంటున్నారు
12:01 PM, Jan 31 2024
కొనసాగుతున్న ఏపీ కేబినెట్ భేటీ
- మంత్రివర్గ సమావేశంలో డీఎస్సీ నోటిఫికేషన్‌పై చర్చ
- టీచర్ పోస్టుల భర్తీకి డిఎస్సీ నిర్వహించేందుకు ఆమోదం తెలిపే అవకాశం
- 6 వేలకు పైగా పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్ జారీపై చర్చించే అవకాశం
- ప్రభుత్వ పాఠశాలల్లో ఐబీ సిలబస్ అమలుకు ఆమోదం తెలపనున్న కేబినెట్
- యూనివర్సిటీలలో నాన్ టీచింగ్ సిబ్బంది పదవి విరమణ వయస్సు 62 ఏళ్లకు పెంపుపై చర్చించనున్న కేబినెట్
- వైఎస్సార్ చేయూత నాలుగో విడతకు ఆమోదం తెలపనున్న కేబినెట్
- ఫిబ్రవరిలో వైఎస్సార్ చేయూత నిధులు విడుదల చేయనున్న ప్రభుత్వం
- ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు 5 వేల కోట్ల మేర నిధుల విడుదలకు ఆమోదం తెలపనున్న క్యాబినెట్
- ఎస్‌ఐపీబి ఆమోదించిన తీర్మానాలను గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్న కేబినెట్
- ఇందన రంగంలో 22 వేల కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలకు ఆమోదం తెలపనున్న కేబినెట్
11:17 AM, Jan 31 2024
కాసేపట్లో ఏపీ కేబినెట్ భేటీ
- సచివాలయానికి బయలుదేరిన సీఎం వైఎస్ జగన్
- ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన కాసేపట్లో రాష్ట్ర సచివాలయం మొదటి బ్లాక్‌లో మంత్రి వర్గ సమావేశం
- 2024-25వ ఆర్థిక సంవత్సరానికిగాను ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాల తేదీల ఖరారు
- పలు ఇతర కీలక అంశాలపై మంత్రి వర్గ సమావేశంలో చర్చ
- రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎస్‌ఐపీబీ) సమావేశంలో ఆమోదించిన పలు పెట్టుబడుల ప్రాజెక్ట్‌లను కూడా ఆమోదించనున్న మంత్రి వర్గం
10:26 AM, Jan 31 2024
రాజకీయ వ్యభిచారి చంద్రబాబు: ఎమ్మెల్యే జక్కంపూడి రాజా
- తెలంగాణలో ఒక పార్టీ, ఇక్కడ మరొక పార్టీతో జత కట్టినచంద్రబాబు రాజకీయ వ్యభిచారిగా తయారయ్యారు
- వెన్నుపోటు పొడవటం, మోసం చేయడం అబద్ధాలు ప్రచారం చేయడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య
- గోదావరి పుష్కరాల్లో చంద్రబాబు హంగామాకు ప్రజలు ప్రాణాలు కోల్పోయారు
- బ్లేడ్ బ్యాచ్ అంటూ అసత్య ప్రచారం చేస్తున్నారు
- గుండెల మీద చేయి వేసుకుని దీనివెనుక ఎవరున్నారో ఆత్మ పరిశీలన చేసుకోవాలి
- తాము అధికారంలోకి వచ్చాక సంఘ విద్రోహ శక్తులను అదుపు చేశాం
9:25 AM, Jan 31 2024
నేడు మంగళగిరిలో సామాజిక సాధికార యాత్ర
- మధ్యాహ్నం 2 గంటలకు వైఎస్సార్ విగ్రహం నుంచి ప్రారంభం కానున్న బస్సు యాత్ర
- హాస్పిటల్ రోడ్డు, గాలి గోపురం, మెయిన్ బజార్ మీదగా మార్కెట్ సెంటర్‌కు యాత్ర
- మార్కెట్ సెంటర్‌లో సామాజిక సాధికార సభ
- పాల్గొననున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మంత్రులు
9:09 AM, Jan 31 2024
చంద్రబాబు పచ్చి మోసకారి?: ధర్మాన కృష్ణదాస్
- అవసరముంటే ఒకలా.. అవసరం తీరాక మరోలా వ్యవహరించగలిగే ఊసరవిల్లి
- పిల్లనిచ్చిన మామనే వెన్నుపోటు పొడిచి అడ్డదారిలో అధికారానికి బాబు వచ్చారు
- నమ్మిన వారిని నట్టేట ముంచడంలో చంద్రబాబు మహా ఘనుడు
- 14 ఏళ్లు పాలించిన చంద్రబాబు రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారు
- పేదలను, నిరుద్యోగులను మోసం చేశారు
7:55 AM, Jan 31 2024
చంద్రబాబులో అణువణువూ విషమే.. మంత్రి అంబటి రాంబాబు ఫైర్
- చంద్రబాబు, పవన్‌కళ్యాణ్ ఓటమి ఖాయం
- వాళ్లు సర్దుకుని హైదరాబాద్ వెళ్లడానికి సిద్ధంగా ఉన్నారు
- చేసిందేమిటో చెప్పుకోలేని దౌర్భాగ్యం చంద్రబాబుది
- బాబు సభలకు జన స్పందనే లేదు
- చంద్రబాబు అంత విషపూరిత రాజకీయ నేత దేశంలోనే లేరు
- వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు-పవన్ బృందానికి ఓటమి ఖాయం
- వారు మూటాముల్లె సర్దుకుని హైదరాబాద్ వెళ్లటానికి సిద్ధంగా ఉన్నారు
- సీఎం వైఎస్ జగన్ రూ.2.53 లక్షల కోట్లు డీబీటీ ద్వారా పేదల ఖాతాల్లో జమచేశారు
- ఇలా రాష్ట్ర చరిత్రలో కనీవినీ ఎరుగని విధంగా సంక్షేమ పథకాలు అందిస్తే విషమవుతుందా?
నిజానికి.. చంద్రబాబు అంత విషపూరిత రాజకీయనేత దేశంలోనే లేరు
-
.@ncbn ని, @naralokesh ని భుజాన మోయడానికి సిద్ధమా.
— YSR Congress Party (@YSRCParty) January 30, 2024
లేదా ప్యాకేజీ ఇస్తే ఎత్తుకుపోవటానికి కూడా సిద్ధమా...దేనికి సిద్ధం @PawanKalyan ?
-మంత్రి అంబటి రాంబాబు#EndOfTDP#PackageStarPK#PoliticalBrokerPK pic.twitter.com/whUElLr83Y
7:13 AM, Jan 31 2024
టీడీపీ ‘ఐ’ గేమ్..!
- టీడీపీ సానుభూతిపరుల ఓట్లు తొలగిస్తున్నారంటూ ఫిర్యాదులు
- ఓట్ల తొలగింపునకు ఫారం–7 నమోదు చేయించేది ఐ టీడీపీ సభ్యులే
- కానీ నేరం వైఎస్సార్‌సీపీపై నెట్టేలా పచ్చపత్రికల ద్వారా దుష్ప్రచారం
- అధికారుల ఆత్మస్థైర్యం దెబ్బతీసేలా రోజూ వ్యతిరేక వార్తలు
- ఎన్నికల కమిషన్‌కు వివరణ ఇచ్చుకోలేక అధికారుల సతమతం
- నెల్లూరు జిల్లాలో వెలుగులోకి వచ్చిన ఐ–టీడీపీ కుట్రకోణం
7:06 AM, Jan 31 2024
నారా లోకేష్ రెడ్ బుక్ బెదిరింపుల కేసు వాయిదా
- లోకేష్ తరపున హాజరైన న్యాయవాది లక్ష్మీనారాయణ
- కౌంటర్ దాఖలు చేయడానికి వారం రోజుల సమయం కోరిన లోకేష్ న్యాయవాది లక్ష్మీనారాయణ
- యువగళం ముగింపు రోజు మీడియా ఛానెళ్లతో వివాదాస్పద వ్యాఖ్యలు వేసిన లోకేష్
- చంద్రబాబుపై తప్పుడు కేసులు బనాయించారని....రిమాండ్ విధించడం తప్పంటూ ఎసిబి న్యాయస్ధానానికి దురుద్దేశాలు ఆపాదించిన లోకేష్
- రెడ్ బుక్ పేరుతో అధికారులకి బెదిరింపులు
- వీడియోలతో సహా ఏసీబీ కోర్టులో గత నెలలో పిటీషన్ వేసిన సిఐడి
- ఏసీబీ కోర్టు ఆదేశాలతో నోటీసులు పంపినా అందుకోని లోకేష్
- చివరగా ఏసీబీ కోర్టు నుంచే లోకేష్ కి నోటీసులు
- కోర్టు నోటీసులకి స్పందించి విచారణకి హాజరైన లోకేష్ న్యాయవాది
- నేటి విచారణలో మరోవారం సమయం అడిగిన లోకేష్ న్యాయవాది లక్ష్మీనారాయణ
- విచారణ ఫిబ్రవరి 6 వ తేదీకి వాయిదా వేసిన ఏసీబీ కోర్టు
7:05 AM, Jan 31 2024
స్కిల్ కేసు విచారణ మరోసారి వాయిదా
- ఫిబ్రవరి 2 వ తేదీకి విచారణ వాయిదా వేసిన ఏసీబీ కోర్టు
- చంద్రకాంత్ షా పిటిషన్ పై అభ్యతరాలు
- స్కిల్ స్కామ్ లో ఎ-2 ముద్దాయి మాజీ ఐఎఎస్ లక్ష్మీ నారాయణ ఏసీబీ కోర్టులో పిటిషన్
- లక్ష్మీనారాయణ పిటీషన్ పై ఇవాళ విచారణ జరిపిన న్యాయస్థానం
- విచారణ వాయిదా వేయాలని కోరిన చంద్రబాబు తరపు న్యాయవాదులు
- ఫిబ్రవరి 2 వ తేదీకి విచారణ వాయిదా వేసిన న్యాయమూర్తి
- అప్రూవర్ గా మారతానని ఏసీఐ ఎండీ చంద్రకాంత్ షా ఇప్పటికే ఎసిబి కోర్టులో పిటీషన్
- కౌంటర్ పేరుతో పలుమార్లు సమయం కోరిన చంద్రబాబు న్యాయవాదులు
- కేసులో కోర్టుకి సమర్పించిన డాక్యుమెంట్స్ ఇవ్వాలని కోరిన చంద్రబాబు నాయుడు తరుపున న్యాయవాదులు
- దీనిపై కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని చంద్రబాబు తరుపున న్యాయవాదులకు ఆదేశించిన కోర్టు
- అప్పటి వరకు సిరీష్ చంద్రకాంత్ షా స్టేట్ మెంట్ రికార్డు వాయిదా వేసిన ఏసిబి కోర్టు
- చంద్రబాబు నాయుడు తరపు న్యాయవాదుల అభ్యంతరాలపై ఈ నెల 22 న ఏసిబి కోర్టులో విచారణ
- కౌంటర్ వేయడానికి సమయమివ్వాలన్న చంద్రబాబు న్యాయవాదులు
- నిన్నటి విచారణలో చంద్రకాంత్ షా పిటీషన్ ని వ్యతిరేకిస్తూ ఏ2 లక్ష్మీనారాయణ కౌంటర్ పిటిషన్
- అడ్డంగా దొరికిపోవడంతో చంద్రకాంత్ షా వాంగ్మూలం అడ్డుకునేందుకు చంద్రబాబు తరపు న్యాయవాదుల రకరకాలగా ఎత్తుగడలు
7:04 AM, Jan 31 2024
పీటీ వారెంట్‌పై విచారణ వాయిదా
- ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబుకి పీటీ వారెంట్పై ఏసీబీ కోర్టులో విచారణ
- ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ మీద బయట ఉన్న చంద్రబాబు
- చంద్రబాబు ముందస్తు బెయిల్ రద్దు కోరుతూ సుప్రీంకోర్టుని ఆశ్రయించిన సీఐడీ
- విచారణ సుప్రీంకోర్టు పరిధిలో ఉండటంతో విచారణ వాయిదా వేసిన ఏసీబీ కోర్టు
- వచ్చే నెల 22 కి వాయిదా
- స్కిల్ కేసులో పీటీ వారెంట్‌పై విచారణ మాత్రం బుధవారమే
6:57 AM, Jan 31 2024
వీరశివారెడ్డి రాజకీయం తెలిసిందే!
- మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి పై కమలాపురం ఎమ్మెల్యే ఫైర్
- నోరు ఉంది కదా అని ఇష్టానుసారంగా మాట్లాడడటం తగదు
- ఆయన రాజకీయ చరిత్ర అందరికి తెలిసిందే
- పేకాట, క్లబ్బులు,సారాయి దుకాణాలు, నడిపించిన ఘనత ఆయనది
- అదృష్టం బాగుండి ఎమ్మెల్యే అయ్యావు
- వైఎస్ కుటుంబ మద్దతుతోనే టీడీపీ లో ఉన్నా నువ్ ఎమ్మెల్యే అయ్యావు
- రెండవ సారి కాంగ్రెస్ పార్టీలో చేరి ఎమ్మెల్యే గా గెలిచావ్
- అధికారం ఎక్కడ ఉంటే వీరశివారెడ్డి ఆ పార్టీలో ఉంటాడు
- ఎమ్మెల్యే గా ఫైరవీలు, ఉద్యోగాల బదిలీలు, అక్రమ ఇసుక పేరుతో దండుకున్నారు
- ఇసుక దొంగ ఆయనే.. సారాయి దొంగ ఆయనే
- హైదరాబాద్, బెంగళూరులో వాహనాల దోంగతనాలకు పాల్పడిన చరిత్ర వీరశివారెడ్డి ది
- బెట్టింగ్ రాయుడు అనేది ఆయనకు ప్రత్యేక బిరుదు
- ఇంకొకరి గురించి వీరశివారెడ్డి మాట్లాడటం హేయమైన చర్య
- కేసులు మాఫీ అయ్యేందుకు 2019 ఎన్నికల తర్వాత వైసీపీకి మద్దతు ఇస్తున్న అన్నాడు
- వైఎస్ జగన్ వల్లే 2009 లో ఎమ్మెల్యే గా అవకాశం వచింది
- బెంగళూరులో అనేక సార్లు జగన్ ను కలిసిన విషయం వాస్తవం కాదా
- వైఎస్సార్సీపీని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను విమర్శలు చేయడం దారుణం
- నా పై చేసిన భూ కబ్జాలు చేసిన ఆరోపణలకు ఆయన కట్టుబడి ఉండాలి
- ఆ భూకబ్జా ఆరోపణల్ని వీరశివారెడ్డి నిరూపించాలి
- వేల ఎకరాలు దండుకున్న ఘనుడు చంద్రబాబు
- ప్రతి జిల్లాలో చంద్రబాబు కు ఆస్తులు ఉన్నాయి
- ప్రతి రాష్ట్రంలో చంద్రబాబు కు బినామీలు ఉన్నారు
- రానున్న ఎన్నికల్లో 175 కి 175 సీట్లు వైసీపీ కైవసం చేసుకుంటుంది
6:56 AM, Jan 31 2024
ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మళ్లీ నోటీసులు
- వైఎస్సార్‌సీపీ నుంచి ఫిరాయించిన నలుగురు ఎమ్మెల్యేలకు మళ్లీ నోటీసులు
- నోటీసులు పంపిన స్పీకర్ కార్యాలయం
- ఫిబ్రవరి 8వ తేదీన స్వయంగా హాజరై వివరణ ఇవ్వాలని కోరిన స్పీకర్ తమ్మినేని సీతారాం
- ఫిబ్రవరి 5వ తేదీలోగా నోటీసులకు స్పందించాలని కోరిన స్పీకర్
- టీడీపీలోకి ఫిరాయించిన నలుగురు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు
- ఎమ్మెల్యేలతో పాటు పిటిషనర్, ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాద రాజుకు కూడా నోటీసులు జారీ
- ఈ ఐదుగురిని ఒకేసారి కలిపి విచారణ చేయనున్నారు స్పీకర్ తమ్మినేని
- మరోసారి ఎమ్మెల్యేల వివరణ తీసుకున్నాకే.. అనర్హత పిటిషన్ విషయంలో ఓ స్పష్టమైన నిర్ణయం ప్రకటించే అవకాశం