సహానా మృతి ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే: రోజా | Ex Minister Roja Serious Comments On Chandrababu And Anitha Over Tenali Sahana Brain Dead Incident | Sakshi
Sakshi News home page

సహానా మృతి ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే: రోజా

Published Wed, Oct 23 2024 6:57 AM | Last Updated on Wed, Oct 23 2024 12:47 PM

Ex Minister Roja Serious Comments On Chandrababu And Anitha

సాక్షి, నగరి: టీడీపీ రౌడీ షీటర్‌ చేతిలో తీవ్రంగా గాయపడిన సహానా మృతి చెందడం బాధాకరమని అన్నారు మాజీ మంత్రి ఆర్కే రోజా. సహానా మృతి ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే అని మండిపడ్డారు. ఈ హత్యకు ముఖ్యమంత్రి చంద్రబాబు, హోంమంత్రి అనితలే బాధ్యత వహించాలని డిమాండ్‌ చేశారు.

మాజీ ఆర్కే రోజా ట్విట్టర్‌ వేదికగా.. ‘గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో  చికిత్స పొందుతున్న సహానా మృతి చెందడం బాధాకరం. సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్న జిల్లాలో, మహిళ హోంమంత్రిగా ఉన్న ఈ రాష్ట్రంలో టీడీపీ రౌడీ షీటర్ కిరాతకంగా దాడి చేసి సహానాను హత్య చెయ్యడం దారుణం. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్య. ఈ హత్యకు ముఖ్యమంత్రి చంద్రబాబు, హోంమంత్రి అనితలే బాధ్యత వహించాలి. మూడు రోజులుగా మృత్యువుతో పోరాడిన సహానాకి మెరుగైన వైద్యం అందించాలని ముఖ్యమంత్రి కానీ, హోంమంత్రి కానీ వెళ్లి వైద్యులను ఆదేశించకపోవడం అమానవీయం. ఇంకా ఎంత మంది అడబిడ్డలను బలి తీసుకుంటారు..?

టీడీపీ నేతలు, రౌడీ షీటర్ల నుండి మహిళల మాన, ప్రాణాలను ముప్పు ఉంది. సహానాను హత్య చేసిన టీడీపీ రౌడీ షీటర్ నవీన్‌ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నా. రియాలిటీ షోకి వెళ్లి వినోదం పొందిన సీఎం చంద్రబాబు ఇప్పుడు సహానా తల్లి కన్నీటికి ఏం సమాధానం చెప్తారు?. సహానా ఆత్మ శాంతించాలని భగవంతుడిని కోరుకుంటున్నాను’ అంటూ కామెంట్స్‌ చేశారు.  

 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement