ప్రజాపాలన అంటే ప్రజలు ఉండరా?: హరీష్‌ రావు కౌంటర్‌ | Harish Rao Political Counter To Congress Party Over Development And Salaries, See Details Inside | Sakshi
Sakshi News home page

ప్రజాపాలన అంటే ప్రజలు ఉండరా?: హరీష్‌ రావు కౌంటర్‌

Published Tue, Jul 2 2024 12:57 PM | Last Updated on Tue, Jul 2 2024 3:55 PM

 Harish Rao Political Counter To Congress Party

సాక్షి, తెలంగాణభవన్‌: తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వంలో గ్రామ పంచాయతీల పరిస్థితి అధ్వాన్నంగా మారింది. తెలంగాణలో పాలన పడకేసిందని మాజీ మంత్రి హరీష్‌ రావు అన్నారు. ప్రజా ప్రభుత్వం అని కాంగ్రెస్‌ నేతలు చెప్పుకుంటున్నారు. కానీ, ఇది ప్రజా వ్యతిరేక ప్రభుత్వం అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

కాగా, హరీష్‌ రావు మంగళవారం తెలంగాణభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ..‘బీఆర్‌ఎస్‌ హయాంలోనే గ్రామాలు అభివృద్ధి చెందాయి. రాష్ట్రంలో ఒకటో తేదీనే జీతాలు ఇస్తున్నామని చెబుతున్నారు. మరి పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు ఎందుకు ఇవ్వడం లేదు. ఏడు నెలలుగా వారికి జీతాలు ఇవ్వలేదు. వారి కుటుంబాలు ఎలా బ్రతుకుతాయి. పల్లెలు ఎలా నడవాలి.

చివరకు సర్పంచ్‌లు వెళ్లి గవర్నర్‌ను కలిశారు. బిల్లుల విషయంలో సర్పంచ్‌లు కన్నీళ్లుపెట్టుకుంటున్నారు. ఇదీ మీ ప్రభుత్వ పనితీరు. గ్రామపంచాయతీల్లో డబ్బులు లేక వ్యవస్థ అస్తవ్యస్తమైంది. ప్రజాపాలన అంటే పాలనలో ప్రజలు ఉండరా?. ప్రతీ రోజు జరిగే శానిటేషన్‌ కూడా చేయడం లేదు. వానాకాలంలో తీసుకునే చర్యలు ఏవీ కూడా తీసుకోవడం లేదు. ప్రజలు వాధ్యుల బారినపడితే ఎవరిది బాధ్యత. బీఆర్‌ఎస్‌ హయాంలో ప్రతీ నెల రూ.275 కోట్లు ఇచ్చాము. కచ్చితంగా నిధులను ఇవ్వడం జరిగింది. ప్రజా ప్రభుత్వంలో ఎందుకు నిధులు ఇవ్వడం లేదు. మా కన్నా మీరు బాగా చేస్తారని మీకు ప్రజలు అవకాశం ఇచ్చారు. కానీ, మీరు చేసిందేమీలేదని ప్రజలు ఆవేదన చెందుతున్నారు. 

పల్లెలను పొడుచుకు తింటుంది ఈ కాంగ్రెస్ అభివృద్ధి శూన్యం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement