అభివృద్ధి పనులను ప్రారంభిస్తున్న మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి
పొదలకూరు (శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా): జనసేన నేత పవన్ కళ్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తోడు దొంగలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి ధ్వజమెత్తారు. సంక్షేమ పథకాలు పేదవారికి అందకుండా చేసేందుకు ఆ ఇద్దరూ పనికట్టుకుని తిరుగుతున్నారని ఆరోపించారు. పొదలకూరులో మంగళవారం పలు అభివృద్ధి పనులను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయంపై పవన్‌కళ్యాణ్ మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు.
పవన్‌కు పది పంటలను చూపిస్తామని, వాటిలో ఐదింటిని గుర్తించాలని సవాల్ విసిరారు. జగనన్న కాలనీల్లోకి వెళ్లి ఇళ్లు నిర్మించుకుంటున్న వారిని ఇబ్బందులకు గురిచేస్తున్నారని తెలిపారు. పొదలకూరులో అద్దె ఇళ్లలో ఉంటున్న పేదలకు పట్టణానికి అతి సమీపంలో కొండకింద స్థలాలు పంపిణీ చేస్తే టీడీపీ నేతలు కోర్టుకు వెళ్లిన విషయాన్ని మంత్రి గుర్తుచేశారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వాన్ని ఏమీ చేయలేరన్నారు.
Comments
Please login to add a commentAdd a comment