రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలు.. ముగిసిన పోలింగ్ | Sakshi
Sakshi News home page

రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలు.. ముగిసిన పోలింగ్

Published Sat, Nov 25 2023 7:20 AM

Rajasthan Assembly Elections Polling Updates Nov 25 - Sakshi

Updates..

రాజస్థాన్‌లో  ప్రశాంతంగా ముగిసిన పోలింగ్
►సాయంత్రం 5 గంటల వరకు 68.24 శాతం పోలింగ్ నమోదు 
►మరికొంత పోలింగ్ శాతం పెరిగే అవకాశం ఉంది.
►గత ఎన్నికల్లో 74% పోలింగ్ నమోదు. 
►డిసెంబర్ 3న కౌంటింగ్ 
►ఇప్పటికే ముగిసిన నాలుగు రాష్ట్రాల పోలింగ్ ప్రక్రియ
►చివరగా ఈనెల 30న తెలంగాణలో పోలింగ్.
 

 సుమర్‌పూర్‌ నియోజకవర్గం పోలింగ్‌ బూత్‌ నెం.47లో కుప్పకూలిన పోలింగ్‌ ఏజెంట్‌.. గుండెపోటుతో మృతి చెందినట్లుగా అనుమానం.

తాజా సమాచారం ప్రకారం 55.63శాతంగా నమోదైన పోలింగ్‌ 

సికార్‌లోని బోచివాల్ భవన్, ఫతేపూర్ షెఖావతి సమీపంలో రాళ్ల దాడి జరిగింది. భారీగా  మోహరించిన పోలీసులు

భాజపా అఖండ మెజారిటీతో అధికారంలోకి  రానుంది. రాజస్థాన్ ప్రజలు గత ఐదేళ్ల దుష్పరిపాలనకు ప్రతీకారం తీర్చుకునేందుకు ఓట్లు వేస్తున్నట్లు కనిపిస్తోంది. నేరాలు, అవినీతి  పాలన అంతంకోసం  జనం ఓటు వేస్తున్నారు- కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్

రాజకీయాల్లో ఉన్న వ్యక్తులెవరైనా ఇలాంటి వ్యాఖ్యలు  చేయడం సరైందికాదు. కొత్త ఓటర్లు ఈ పరిణామాల్ని గమనిస్తున్నారు: ప్రధాని మోదీని ఉద్దేశించి రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేత, రాజస్థాన్ మాజీ సీఎం వసుంధర రాజే

► మధ్యాహ్నం 1 గంటల వరకు 40శాతానికి పైగా నమోదైన ఓటింగ్ 

► పోలింగ్‌కు సంబంధించి గట్టి భద్రత ఏర్పాటు చేశామని  డీజీపీ పుమేష్‌మిశ్రా  తెలిపారు. ఓటింగ్‌లో ప్రజలు చురుగ్గా పాల్లొంగుటున్నారనితెలిపారు. ఇది ప్రజాస్వామ్యానికి పండుగ  లాంటి, స్వేచ్ఛగా, నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని ఓటర్లకు డీజీపి పిలుపునిచ్చారు.

► కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, అసెంబ్లీ స్పీకర్ సీపీ జోషి రాజ్‌సమంద్ జిల్లాలో ఓటు వేశారు.

రాజ‌స్థాన్‌లోని బిల్వారాలో బీజేపీ ఎంపీ సుభాష్ చంద్ర బ‌హేరియా ఓటు హ‌క్కును వినియోగించుకున్నారు.  ముఖ్యంగా  భార్య‌తో క‌లిసి  వచ్చి  టూవీల‌ర్‌పై సాదాసీదాగా పోలింగ్‌ బూత్‌కు రావడం విశేషంగా నిలిచింది.

రాజస్థాన్ కాంగ్రెస్ చీఫ్ గోవింద్ సింగ్ దోతస్రా సికార్‌లో ఓటు వేశారు.  ఆయన లక్ష్మణ్‌గఢ్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. 

రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలకు నేడు పోలింగ్ నడుస్తోంది. ఉదయం 11 గంటలకు 24.74 శాతం పోలింగ్ నమోదైంది. 

► రాజస్థాన్ గవర్నర్ కల్‌రాజ్ మిశ్రా జైపూర్‌ పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు.

►రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోత్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. సర్దార్‌పూర్ పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. రాష్ట్రంలో మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పరుస్తుందని తెలిపారు. ఈ రోజు నుంచి బీజేపీ కనిపించబోదని అన్నారు. 

► రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోత్ కుమారుడు వైభవ్ గహ్లోత్ సర్దార్‌పూర్ చేరుకున్నారు. కుటుంబ సమేతంగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. 

►కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. బికణీర్‌ పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పరుస్తుందని తెలిపారు. 

►రాజస్థాన్‌లో ఉదయం 9:00 గంటలకు 9.77 శాతం పోలింగ్ నమోదైందని ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు.  

►కాంగ్రెస్ నాయకుడు సచిన్ పైలెట్ పోలింగ్‌లో పాల్గొన్నారు. జైపూర్‌లోని సివిల్ లైన్స్ ఏరియా పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు.

► రాజస్థాన్ ఎన్నికలు నేడు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మొదటిసారి ఓటు హక్కు వినియోగించుకుంటున్న యువతకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. అందరూ పోలింగ్‌లో పాల్గొని రికార్డ్ బ్రేక్ చేయాలని కోరారు.

►రాజస్థాన్ కాంగ్రెస్ నాయకుడు సచిన్ పైలెట్ ఓటు హక్కుని వినియోగించుకునే ముందు బాలాజీ దేవాలయంలో పూజలు నిర్వహించారు. రానున్న ఐదేళ్లకు రాష్ట్ర భవిష్యత్‌ కోసం ప్రజలు సరైన తీర్పును ఇస్తారని భావిస్తున్నట్లు పైలెట్ చెప్పారు. కాంగ్రెస్ విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

►బీజేపీ నాయకురాలు, మాజీ సీఎం వసుంధర రాజే ఝలావర్‌లోని పోలింగ్ బూత్‌లో ఓటు హక్కుని వినియోగించుకున్నారు. గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు. 

► బీజేపీ నాయకుడు గజేంద్ర సింగ్ షెకావత్ కుటుంబ సమేతంగా జోధ్‌పుర్‌లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. 

►రాజస్థాన్‌లో నేడు అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ జరుగుతోంది. ఉదయం 7 గంటలకు  పోలింగ్ ప్రారంభమైంది. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు ఇప్పటికే బారులు తీరారు. 

►రాజస్తాన్‌ శాసనసభ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. శనివారం ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల దాకా పోలింగ్‌ జరుగనుంది. 200 నియోజకవర్గాలకు గాను 199 నియోజకవర్గాల్లో పోలింగ్‌ నిర్వహించేందుకు ఎన్నికల సంఘం అధికారులు సిద్ధమయ్యారు. శ్రీగంగానగర్‌ జిల్లాలోని కరణ్‌పూర్‌ స్థానంలో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి, సిట్టింగ్‌ ఎమ్మెల్యే గురీత్‌సింగ్‌ కూనార్‌ మరణించడంతో ఇక్కడ పోలింగ్‌ను వాయిదా వేశారు. రాజస్తాన్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి 1,862 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.

►రాష్ట్రంలో మొత్తం 5.25 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ అన్ని స్థానాల్లోనూ తమ అభ్యర్థులను బరిలోకి దించింది. కాంగ్రెస్‌ పార్టీ భరత్‌పూర్‌ స్థానాన్ని తమ మిత్రపక్షం రాష్ట్రీయ లోక్‌దళ్‌(ఆర్‌ఎల్డీ)కి కేటాయించింది. కాంగ్రెస్, బీజేపీతోపాటు సీపీఎం, ఆర్‌ఎల్పీ, భారత్‌ ఆదివాసీ పార్టీ, భారతీయ ట్రైబల్‌ పార్టీ, ఆమ్‌ ఆద్మీ పార్టీ, ఎంఐఎం తదితర పార్టీలు సైతం పోటీకి దిగాయి. పెద్ద సంఖ్యలో తిరుగుబాటు అభ్యర్థులు బరిలోకి దిగడం కాంగ్రెస్, బీజేపీలకు ఆందోళన కలిగిస్తోంది.  

బరిలో ఉద్ధండులు..  
పోలింగ్‌ సజావుగా జరగడానికి అన్ని చర్యలు తీసుకున్నామని, కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామని రాజస్తాన్‌ చీఫ్‌ ఎలక్టోరల్‌ ఆఫీసర్‌ ప్రవీణ్‌ గుప్తా తెలిపారు. ఎన్నికల్లో ముఖ్యమంత్రి, కాంగ్రెస్‌ నేత అశోక్‌ గహ్లోత్, పీసీసీ అధ్యక్షుడు గోవింద్‌సింగ్, అసెంబ్లీ స్పీకర్‌ సీపీ జోషీ, మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్‌ పైలట్‌ తదితరులు మరోసారి అదృష్టం పరీక్షించుకుంటున్నారు. బీజేపీ నుంచి సీనియర్‌ నేతలు వసుంధర రాజే, రాజేంద్ర రాథోడ్, సతీష్‌ పూర్ణియా, ఎంపీలు దివ్యా కుమారి, రాజ్యవర్దన్‌ రాథోడ్, బాబా బాలక్‌నాథ్, కిరోడీలాల్‌ మీనా తదితరులు పోటీపడుతున్నారు. అధికార కాంగ్రెస్, విపక్ష బీజేపీ మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది.

Advertisement
Advertisement