నెమలిగుండం ప్రత్యేకం... | - | Sakshi
Sakshi News home page

నెమలిగుండం ప్రత్యేకం...

Published Mon, Nov 20 2023 2:04 AM | Last Updated on Mon, Nov 20 2023 2:04 AM

త్రిపురాంతకేశ్వరుని ఆలయం  - Sakshi

త్రిపురాంతకేశ్వరుని ఆలయం

శ్రీకృష్ణదేవరాయులు సతీమణి వరదరాజమ్మ నిర్మించిన రాష్ట్రంలోనే అతిపెద్దదైన కంభం చెరువు, ప్రకృతి సోయగాల నడుమ జలజల ప్రవహించే గుండ్లకమ్మ పరవళ్లతో రాచర్ల మండలంలోని శ్రీ నెమలిగుండ్ల రంగనాయకస్వామి వారి ఆలయం ఉన్నాయి. ఆలయ పరిసరాల్లోని ప్రదేశాలు ఆహ్లాదకర వాతావరణాన్ని కలిగిస్తాయి. విజ్ఙానంతో పాటు వినోదాన్ని పంచుతాయి. కార్తీక వనభోజనాలను దేవదాయశాఖ అనుమతితో నిర్వహించుకోవచ్చు. మార్కాపురం నుంచి శ్రీశైలానికి ప్రతి గంటకు ఆర్టీసీ బస్సులు ఉంటాయి. ఒంగోలు నుంచి 170 కిలోమీటర్ల దూరంలో శ్రీశైలం ఉంటుంది. రాష్ట్రంలోని వివిధ డిపోల బస్సులు ఒంగోలు – మార్కాపురం మీదుగా శ్రీశైలం వెళ్తాయి. శ్రీశైలంలో కూడా కార్తీక వనసమారాధనలు నిర్వహించుకోవచ్చు.

మార్కాపురంలోని శ్రీలక్ష్మీచెన్నకేశవస్వామి దేవాలయం ఎంతో ప్రసిద్ధి చెందింది. నాలుగు యుగాల్లో స్వామివారి ఆలయం ఉన్నట్లు పురాణాల్లో పేర్కొన్నారు. శ్రీకృష్ణ దేవరాయుల కాలంలో నిర్మించిన ఈ దేవాలయంలో 18 శాసనాలు ఉన్నాయి. ప్రస్తుతం ఆలయంలో నాలుగు రాజగోపురాల నిర్మాణ పనులు జరుగుతున్నాయి.

కార్తీక వనభోజనాలకు

ఎంతో విశిష్టత

కార్తీకమాసం అంటేనే ఆధ్యాత్మికతతో పాటు వనభోజనాలు ప్రత్యేకం. ఇందులో ప్రతిరోజూ ఒక పర్వదినమే. ఉదయాన్నే తలస్నానం చేసి శివారాధన చేస్తే చాలామంచిది. ముఖ్యంగా కార్తీక సోమవారం ఏకాదశి, కార్తీక పౌర్ణమి, మాస శివరాత్రి రోజున ప్రత్యేక పూజలు చేస్తుంటారు. అనేక పండుగలు ఉన్నప్పటికీ కార్తీక మాసంలో వన భోజనాలకు ఉన్న ప్రత్యేకత ఏ పండుగకూ లేదు. అందరూ కలిసి ఒకచోట చేరి భోజనాలు చేయడం ఒక మంచి అనుభూతి.

– జీఎల్‌ రమేష్‌బాబు, తెలుగు

ఉపాద్యాయుడు, జెడ్పీ బాలుర పాఠశాల

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/1

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement