అబద్ధానికి నిజరూపం చంద్రబాబే
దర్శి: ఎన్నికల ముందు అలివిగాని అబద్ధపు హామీలివ్వడం, ఇచ్చిన హామీలన్నీ ఎగ్గొట్టడం అలవాటైన చంద్రబాబు విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు కూడా ఇవ్వకుండా అబద్ధాలకు నిజరూపం అని నిరూపించుకుంటున్నారని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ విమర్శించారు. స్థానిక వైఎస్సార్ సీపీ దర్శి నియోజకవర్గ కార్యాలయంలో ఈ నెల 5న ఒంగోలులో నిర్వహించే ఫీజుపోరు వాల్ పోస్టర్‌లను బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, బూచేపల్లి వెంకాయమ్మ ఆదివారం విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించాలని కోరుతూ ఈ నెల 5వ తేదీ ఉదయం 11 గంటలకు ఒంగోలులోని నెల్లూరు బస్టాండ్ నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు భారీ నిరసన ర్యాలీ నిర్వహిస్తామన్నారు. అనంతరం కలెక్టర్‌కు వినతి పత్రం ఇస్తామని చెప్పారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి చదువుకునే పేద విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్, వసతి దీవెన బకాయిలు రూ.3900 కోట్లు పెండింగ్ పెట్టి అవి చెల్లించకుండా చంద్రబాబు రాక్షసత్వం చూపుతున్నారన్నారు. పేద, మధ్య తరగతి విద్యార్థులను ఫీజులు కట్టాలని కళాశాలల్లో ఒత్తిళ్లు చేస్తుంటే విద్యార్థులు ఫీజులు చెల్లించలేక పొలం బాట పట్టి కూలి పనులకు వెళ్లాల్సిన దుస్ధితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో ఒక్క విద్యాదీవెన, వసతి దీవెనలకే రూ.18 వేల కోట్లు ఖర్చు చేసిన ఘనత మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిదే అని చెప్పారు. ఇటీవల నారాయణ కళాశాలలో ఫీజులు చెల్లించలేదని ఇబ్బందులు పెడితే ఆ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుని మృతి చెందిన విషయాన్ని గుర్తు చేశారు. నాడు– నేడు పెండింగ్ పనులకు ఒక్క రూపాయి కూడా విదల్చకపోవడం దుర్మార్గంగా ఉందన్నారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా చేపట్టిన ఫీజు పోరు నిరసనకు జిల్లా లోని విద్యార్థుల తల్లిదండ్రులు, వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలంతా హాజరై విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో మండల కన్వీనర్ వెన్నపూస వెంకటరెడ్డి, ఎస్సీసెల్ జిల్లా అధ్యక్షుడు గాలిమూటి దేవప్రసాద్, వాణిజ్య విభాగం జిల్లా అధ్యక్షుడు కొల్లా ఉదయభాస్కర్, జెడ్పీటీసీలు నుసుం వెంకటనాగిరెడ్డి, తాతపూడి రత్నరాజు, వైస్ ఎంపీపీ సోము దుర్గారెడ్డి, కౌన్సిలర్లు ఆవుల జ్యోతి, మేడం మోహన్‌రెడ్డి, తుళ్లూరి బాబురావు, మాజీ జేసీఎస్ కన్వీనర్ మేడికొండ జయంతి, సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడు కేసరి రాంభూపాల్ రెడ్డి, ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు బొమ్మిరెడ్డి లక్ష్మీరెడ్డి, ఎస్సీసెల్ అధ్యక్షుడు జీ ఏసుదాసు, మైనార్టీ సెల్ అధ్యక్షుడు అమీన్‌బాషా తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థులను వేధిస్తున్న కూటమి సర్కార్ విద్యార్థులకు అండగా వైఎస్సార్ సీపీ ‘ఫీజు పోరు’ ‘ఫీజు పోరు’ వాల్‌పోస్టర్‌లు విడుదల చేసిన బూచేపల్లి
Comments
Please login to add a commentAdd a comment