గ్రామస్తుడితో మాట్లాడుతున్న ట్రైనీ డీఎస్పీ షెహనాజ్, సీఐ, ఎస్సై
● నిందితుడిని పోలీసులకు అప్పగించిన స్థానికులు
మార్కాపురం రూరల్: బాలుడిని కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించిన వ్యక్తిని స్థానికులు చితకబాది పోలీసులకు అప్పగించారు. ఈ సంఘటన మంగళవారం మార్కాపురం మండలంలోని రాయవరం గ్రామంలో చోటుచేసుకుంది. రూరల్ ఎస్సై వెంకటేశ్వరనాయక్ కథనం ప్రకారం.. బీహార్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి రైల్వేస్టేషన్‌లో రైలు దిగి నడుచుకుంటూ రాయవరం గ్రామంలోకి వచ్చాడు. రోడ్డుపై వెళ్తున్న ఆరేళ్ల బాలుడిని పట్టుకోవడంతో భయపడి బిగ్గరగా కేకలు వేశాడు. చుట్టుపక్కల వారు గమనించి బీహార్ వాసిని పట్టుకుని దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. అతని వద్ద ఎటువంటి గుర్తింపు కార్డులు లేకపోవడం, సరిగా సమాధానం చెప్పకపోవడం తదితర కారణాలతో మతిస్థిమితం లేని వ్యక్తిగా పోలీసులు భావిస్తున్నారు. ట్రైనీ డీఎస్పీ షెహనాజ్, సీఐ ఎ.వెంకటేశ్వర్లు, రూరల్ ఎస్సై వెంకటేశ్వరనాయక్ సంఘటనా స్థలానికి చేరుకుని గ్రామస్తులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment