కురిచేడు: మండలంలోని దేకనకొండ గ్రామంలో సోమవారం రాత్రి గణేశ నిమజ్జనంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో టీడీపీ వర్గీయులు పథకం ప్రకారం వైఎస్సార్ సీపీ వర్గీయులపై రాళ్ల దాడి చేయడంతో ఐదుగురికి గాయాలయ్యాయి. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం రాత్రి టీడీపీ వర్గీయుల గణేష్ నిమజ్జనం జరుగుతుండగా, పొలం పనులు ముగించుకుని ట్రాక్టర్‌తో కటకం రామయ్య ఇంటికి వస్తున్నాడు. మధ్యలో గణేష్ నిమజ్జన కార్యక్రమం జరుగుతుండటంతో తన ట్రాక్టర్‌ను పక్కన పెట్టుకుని ఉన్నాడు. గ్రామంలోని వైఎస్సార్ సీపీ వర్గీయుల విగ్రహ నిమజ్జనం బుధవారం జరగనుంది. దానిని అడ్డుకునే ప్రణాళికలో భాగంగా రామయ్య తమను తిట్టినట్లుగా సృష్టించి టీడీపీ వర్గీయులు గొడవకు దిగారు. ఏకంగా ఇళ్లపైకి ఎక్కి వైఎస్సార్ సీపీ వర్గీయుల ఇళ్లపై రాళ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో అన్నెం సుబ్బారెడ్డి, మార్తల రమణారెడ్డి, కటకం వెంకటరత్నం, తాటిమట్ల కృష్ణ, ఉట్టి చిన్న వెంకటేశ్వర్లుకు గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న సీఐ సూరేపల్లి సుబ్బారావు తన సిబ్బందితో గ్రామానికి వెళ్లి పరిస్థితిని అదుపు చేశారు. క్షతగాత్రులను దర్శి వైద్యశాలకు తరలించారు. గ్రామంలో పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేసి పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
పథకం ప్రకారం వైఎస్సార్ సీపీ వర్గీయులపై రాళ్లు రువ్విన టీడీపీ వర్గీయులు
ఐదుగురికి గాయాలు
Comments
Please login to add a commentAdd a comment