సింగరాయకొండ: బుల్లెట్‌పై వినాయక నిమజ్జనానికి వెళ్తూ బస్సు వెనుక చక్రాల కింద పడి వ్యక్తి మృతిచెందిన సంఘటన సోమవారం రాత్రి సింగరాయకొండ మండల కేంద్రంలోని కందుకూరు రోడ్డు సెంటర్లో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. జీవీఆర్ ఆక్వా ప్రాసెసింగ్ కంపెనీలో సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్న పూనం మీనాశేఖరరెడ్డి (51) వినాయకచవితిని పురస్కరించుకుని తన కంపెనీలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం నిమజ్జనానికి బుల్లెట్‌పై వెళ్తున్నాడు. కందుకూరు రోడ్డు సమీపంలో విగ్రహాన్ని దాటి ముందు వెళ్తున్న నెల్లూరు – విజయవాడ ఆర్టీసీ బస్సును క్రాస్‌చేసే క్రమంలో ప్రమాదవశాత్తూ రోడ్డు మార్జిన్లో ఉన్న గుంతలోకి బుల్లెట్ వెళ్లింది. దీంతో అదుపుతప్పి పడిపోయాడు. పక్కనే వెళ్తున్న బస్సు వెనుక టైర్ కింద మీనాశేఖరరెడ్డి పడటంతో తీవ్రగాయాలయ్యాయి. వెంటనే ఒంగోలులోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ మరణించాడని ఎస్సై బి.మహేందర్ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు చెప్పారు. శేఖర్‌రెడ్డికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.
బస్సు వెనుక టైరు కింద పడి మృతి
Comments
Please login to add a commentAdd a comment