మేతబీడు భూములను పరిశీలిస్తా..
తర్లుపాడు: మండలంలోని మేతబీడు భూములను పరిశీలించి కబ్జా నుంచి కాపాడేందుకు తగిన చర్యలు తీసుకుంటానని తర్లుపాడు తహసీల్దార్ జయవర్దన్ తెలిపారు. మండలంలోని 200 ఎకరాల మేతబీడు భూములను కబ్జా చేసేందుకు టీడీపీ నేతలు పన్నాగం పన్నడంపై సాక్షి దినపత్రికలో ఈ నెల 4వ తేదీ ‘మేతబీడు కొట్టేశారు’ అనే శీర్షికతో ప్రచురితమైన కథనానికి సోమవారం తహసీల్దార్ ఫోన్‌లో వివరణ ఇచ్చారు. సదరు భూములు తమ రికార్డుల్లో నిషేధిత భూముల జాబితా (22ఏ)లో ఉన్నట్లు తెలిపారు. వరద బాధితులకు సహాయక చర్యల్లో భాగంగా తాను విజయవాడలో విధులు నిర్వర్తిస్తున్నానని, తిరిగి వచ్చాక మరోసారి భూములను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటానని తహసీల్దార్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment