పశ్చిమ ప్రకాశంలోని సుమారు 8 లక్షల మంది ప్రజలకు అత్యాధునిక వైద్యసేవలు అందించాలన్న లక్ష్యంతో మెడికల్ కళాశాల ఏర్పాటుకు గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అనుమతలు మంజూరు చేశారు. అంతేకాకుండా రూ.475 కోట్లు విడుదల చేశారు. పనులు సైతం వేగంగా జరిగాయి. కూటమి ప్రభుత్వం ఈ మెడికల్ కళాశాలపై సవతి తల్లిప్రేమ చూపిస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పాడేరు గిరిజన ప్రాంతం కావడంతో అక్కడ వైద్యసేవలు అందాలనే ఉద్దేశంతో మెడికల్ కళాశాలతోపాటు అడ్మిషన్లకు అనుమతి ఇచ్చింది. అయితే పశ్చిమ ప్రకాశంలోని పుల్లలచెరువు, యర్రగొండపాలెం, పెద్దదోర్నాల, పెద్దారవీడు, అర్థవీడు, రాచర్ల, కొమరోలు, గిద్దలూరు మండలాల్లో సుమారు 72 చెంచుగూడేలు ఉన్నాయి. ఇందులో ప్రధానంగా నల్లమల అటవీ ప్రాంతంలో చిన్నారుట్ల, పెద్దారుట్ల, పనుకుమడుగు, బందంబావి, పాలుట్ల, అక్కచెరువుతాండ, బోడేనాయక్ తాండ, వై చెర్లోపల్లి, నల్లగుంట్ల, వెంకటాద్రిపాలెం, కలనూతల, గుండంచర్ల, అక్కపాలెం, మర్రిపాలెం, గన్నెపల్లి, వెలగలపాయ, బొల్లుపల్లి, మాగుటూరు తాండ, వెల్లుపల్లి, జేపీ చెరువు, మాగుటూరు తాండ, గొట్టిపడియ తదితర ప్రాంతాలన్నీ చెంచుగిరిజన ప్రాంతాలు. ఇక్కడ వేలాది మంది గిరిజనులు నివాసముంటున్నారు. మరి మార్కాపురాన్ని ఎందుకు విస్మరించారో ప్రభుత్వ పెద్దలే చెప్పాలి.
Comments
Please login to add a commentAdd a comment