ఒంగోలు సెంట్రల్: ఒంగోలు రీజియన్ పరిధిలోని పొగాకు వేలం కేంద్రాల్లో సోమవారం నిర్వహించిన వేలంలో కేజీ గరిష్ట ధర రూ.358 పలికింది. ఆర్‌ఎం లక్ష్మణరావు తెలిపిన వివరాల ప్రకారం.. రీజియన్ పరిధిలోని 11 వేలం కేంద్రాల్లో 10,202 బేళ్లు వేలానికి రాగా 8,725 బేళ్లను వ్యాపారులు కొనుగోలు చేశారు. 1,477 బేళ్లను వివిధ కారణాలతో తిరస్కరించారు. ఒంగోలులోని రెండు కేంద్రాలు, వెల్లంపల్లి, కొండపి, టంగుటూరు కేంద్రాల్లో 151వ రోజు నిర్వహించిన వేలంలో 5,456 బేళ్లు వేలానికి రాగా, 4,946 బేళ్లను వ్యాపారులు కొనుగోలు చేశారు. 510 బేళ్లను వివిధ కారణాలతో తిరస్కరించారు. కేజీ గరిష్ట ధర రూ.358, కనిష్ట ధర రూ.190, సరాసరి రూ.309.92 పలికింది. కందుకూరు–1, 2, కనిగిరి, డీసీ పల్లి, కలిగిరి, పొదిలి కేంద్రాల్లో 145వ రోజు నిర్వహించిన వేలానికి 4,746 బేళ్లు రాగా, 3,779 బేళ్లను వ్యాపారులు కొనుగోలు చేశారు. 967 బేళ్లను వివిధ కారణాలతో తిరస్కరించారు. కేజీ గరిష్ట ధర రూ.358, కనిష్ట ధర రూ.180, సరాసరి ధర రూ.271.70 పలికింది.
Comments
Please login to add a commentAdd a comment