బండ పడినట్లే!
బయటకొస్తే
కురిచేడు: మండలంలోని దేకనకొండ గ్రామంలో సోమవారం రాత్రి ప్రారంభమైన రాళ్లదాడి మంగళవారం కూడా కొనసాగింది. పోలీసులు గ్రామంలో ఉండగానే కూటమి వర్గీయులు.. కూరగాయల సంచుల్లో కూరగాయలు తెచ్చుకుంటున్న చందంగా రాళ్లను తమ ఇళ్లపైకి చేర్చుకుని మంగళవారం ఉదయం మరలా రాళ్లదాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో పడిగపాటి అంజిరెడ్డి కి రక్తగాయాలయ్యాయి. గ్రామంలో భయానక వాతావరణం సృష్టించటమే తమ లక్ష్యమని బహిరంగంగా కూటమి వర్గీయులు సవాళ్లు విసురుతున్నారు. గ్రామంలో బయట నుంచి కొందరు వ్యక్తులను పిలిపించి గొడవకు సన్నద్ధమవుతున్నారు. మంగళవారం రాత్రికి మరలా దాడిచేయాలని ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్లు పోలీసులకు.. వైఎస్సార్ సీపీ కార్యకర్తలు, క్షతగాత్రులు తెలిపారు. ఎలాగైనా బుధవారం వైఎస్సార్ సీపీ వర్గీయులు ఏర్పాటు చేసుకున్న గణేశనిమజ్జనం జరగకుండా చేయటమే లక్ష్యం గా పెట్టుకున్నట్లు గ్రామంలో అక్కడక్కడా ప్రచారం జరుగుతోంది. కొందరు వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టి గొడవలు సృష్టిస్తున్నట్లు తెలిసింది. ఉదయం 10 గంటల వరకు కొనసాగిన రాళ్లదాడి.. పోలీసు బలగాలు గ్రామంలోకి రావటంతో సద్దుమణిగింది.
పోలీసు వలయంలో దేకనకొండ
మండలంలోని దేకనకొండ గ్రామం పోలీసుల అదుపులోకి వెళ్లింది. దర్శి డీఎస్పీ లక్ష్మీనారాయణ ఆదేశాల మేరకు సీఐ సూరేపల్లి సుబ్బారావు ప్రత్యేక బలగాలను రప్పించి గ్రామాన్ని తమ కంట్రోలులోకి తెచ్చుకున్నారు. దీంతో ఉదయం వరకు రెచ్చిపోయిన కూటమి నాయకుల కుతంత్రాలుకు అడ్డుకట్టపడింది. గ్రామంలో ఎవరైనా బయటకు వచ్చినా, గొడవకు సిద్ధపడ్డా వారిని అరెస్టు చేస్తామని పోలీసులు హెచ్చరించారు. పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేసి పహారా కాస్తున్నారు.
తగ్గని రాళ్లదాడి ఒకరికి గాయాలు కూరగాయల సంచుల్లో రాళ్ల సరఫరా దేకనకొండ గ్రామంలో కొనసాగుతున్న ఉద్రిక్తత
Comments
Please login to add a commentAdd a comment