కనిగిరిలో ఆర్మీ సైకిల్ యాత్ర
కనిగిరి రూరల్: ఇండియన్ ఆర్మీ 75 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆర్మీ అధికారులు, సిబ్బంది చేపట్టిన ఆర్మీ సైకిల్ సాహస యాత్ర మంగళవారం కనిగిరికి చేరుకుంది. ఈ సందర్భంగా విద్యార్థులు, పలువురు అధికారులు, పట్టణ ప్రముఖులు ఘన స్వాగతం పలికారు. అనంతరం స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో నిర్వహించిన కార్యక్రమంలో ఆర్మీ జూనియర్ కమిషన్డ్ అధికారి గురూన్‌జీ, మేజర్‌లు రావత్, అభిజీత్ మాట్లాడారు. జాతీయ సమైఖ్యత, దేశ భద్రత, రక్షణలో భాగస్వామ్యం పై అవగాహన, పర్యావరణ పరిరక్షణ, ఆర్మీ పై అవగాహన తదితర అంశాలపై వివరించారు. ఈ యాత్ర కాశ్మీర్ (లడాక్) లోని సియాచిన్ దగ్గర నుంచి అండమాన్ నికోబార్ దీవుల్లోని ఇందిరా పాయింట్ వరకు సాగుతుందన్నారు. మొత్తం 5,500 కి.మీల దూరం సాగే యాత్రలో భాగంగా ఇప్పటి వరకు 3,269 కి.మీల దూరం సైకిల్ యాత్ర బృందం పూర్తి చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో సీఐ ఎస్‌కే ఖాజావలి, ఎస్సై టీ త్యాగరాజు, ఎంఈఓ జీ సంజీవి, ప్రిన్సిపాల్ రమణారెడ్డి, టీడీపీ పట్టణ అధ్యక్షుడు తమ్మినేని శ్రీనివాసులరెడ్డి తదితరులు పాల్గొన్నారు. తొలుత ప్రభుత్వ ఉన్నత పాఠశాల, జూనియర్ కళాశాల విద్యార్థులు..స్థానిక చర్చి సెంటర్ నుంచి కళాశాల వరకు 400 అడుగుల భారీ జాతీయ జెండాతో ఆర్మీ సైకిల్ యాత్రకు ఘన స్వాగతం పలికారు.
Comments
Please login to add a commentAdd a comment