జగన్ బొమ్మ చూస్తే పచ్చ నేతలకు వణుకు
యర్రగొండపాలెం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బొమ్మ చూస్తేనే పచ్చ నేతలకు వణుకు మొదలవుతుంది. మంగళవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో ఆ పరిస్థితి ఏర్పడింది. సచివాలయం నోటీసు బోర్డులో ఉన్న జగన్ బొమ్మను చూసి వాళ్లలో ఆవేశంతో కూడిన వణుకు మొదలయింది. కాసేపు తమ వర్గానికి చెందిన పంచాయతీ కార్యదర్శి ఈదుల రాజశేఖరరెడ్డిపై చిందులు తొక్కారు. డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీకి సంబంధించిన సూచనలతో కూడిన వాల్‌పోస్టర్‌ను సచివాలయం– 2కు సంబంధించిన నోటీసు బోర్డులో అంటించారు. ఆ పోస్టర్‌పై జగన్‌మోహన్‌రెడ్డి ఫొటో ముద్రించి ఉంది. ప్రభుత్వం మారినప్పటికీ ఆరోగ్యశ్రీపై ప్రజలకు అవగాహన కోసం ఆ వాల్‌పోస్టర్‌ను సిబ్బంది తొలగించలేకపోయారు. ఆ ప్రాంతంలో ఉన్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, బాబు జగ్జీవన్‌రాం ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన స్కిల్ హబ్ కార్యక్రమంలో పాల్గొనేందుకు టీడీపీ నాయకులు అక్కడికి చేరారు. కాగా సచివాలయ నోటీసు బోర్డుపై ఉన్న ఈ వాల్‌పోస్టర్‌ను చూసిన పచ్చ నాయకులు గజ గజ వణకిపోయారు. ఆయన ఫొటోతో ఉన్న వాల్‌పోస్టర్ పంచాయతీ పరిధిలో ఎక్కడ ఉన్న సహించేదిలేదని.. వెంటనే వాటిని తొలగించాలని హుకుం జారీ చేశారు. దీంతో పంచాయతీ కార్యదర్శి నోటీసు బోర్డులో ఉన్న వాల్ పోస్టర్‌ను తొలగించారు.
Comments
Please login to add a commentAdd a comment