ఇదేం కక్ష సాధింపు
దర్శి: ‘ఒకటి కాదు..రెండు కాదు..ఏకంగా నాలుగుసార్లు ఒకే రేషన్ దుకాణంపై తనిఖీ. ఒక్క అరకేజీ అయినా ఎక్కువో, తక్కువో చూయించి కేసు నమోదు చేసి దుకాణాన్ని స్వాధీనం చేసుకోవాలి’ ఇదీ దర్శి మండలంలోని పెద ఉయ్యాలవాడ రేషన్ దుకాణంపై అధికారుల కక్ష సాధింపు. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లో ఇప్పటికీ మూడుసార్లు ఆ రేషన్ దుకాణాన్ని తనిఖీ చేసిన అధికారులు మంగళవారం నాల్గో సారి తనిఖీకి వచ్చారు. గతంలో ఎన్‌ఫోర్సుమెంట్ డీటీ ఒకసారి, ఆర్‌ఐ ఒకసారి, మరోసారి వీఆర్‌ఓలు రాగా..మంగళవారం ఇన్‌చార్జి ఆర్‌ఐతో పాటు ఐదుగురు వీఆర్‌ఓలు, కానిస్టేబుల్ తనిఖీకి వచ్చారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 8 గంటల వరకు తనిఖీ చేశారు. ముఠా వాళ్లను పిలిపించి దుకాణంలో ఉన్న బియ్యం మొత్తాన్ని బయట వేసి కాగా వేశారు. అయినా తనిఖీల్లో ఒక్క కేజీ కూడా సరుకు తేడా గుర్తించలేకపోయారు. దింపిన సరుకు దింపినట్లు ఉంది. ఇప్పటి వరకు రేషన్ బండిని పంపకుండా ఆపారు. దీంతో గ్రామంలో ఎకరికీ రేషన్ ఇవ్వలేదు. అయితే రోజంతా తనిఖీ చేసినా ఏం చేయలేకపోయామన్న బాధ వీఆర్‌ఓల్లో కనిపించింది. మరో పక్క డీలర్ రాజీనామా చేయాలని అధికారుల నుంచి బెదిరింపులు వస్తున్నాయి.
ఒకే రేషన్ దుకాణంలో నాలుగు సార్లు తనిఖీ కొలతల్లో తేడా రాకపోవడంతో నిరాశతో వెనుదిరిగిన అధికారులు
Comments
Please login to add a commentAdd a comment