హెచ్‌ఎంలు నిధులు సద్వినియోగం చేయాలి
● డీఈవో సుభద్ర
ఒంగోలు: జిల్లాలో ఎంపిక చేసిన పీఎం శ్రీ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ప్రభుత్వం నుంచి మంజూరైన నిధులను సద్వినియోగం చేసుకోవాలని, తద్వారా పాఠశాల అభివృద్ధిలో స్కూల్ మేనేజ్‌మెంట్ చైర్మన్ సహకారంతో ముందడుగు వేయాలని జిల్లా విద్యా శాఖాధికారి డి.సుభద్ర పేర్కొన్నారు. స్థానిక సమగ్రశిక్ష సమావేశం మందిరంలో మంగళవారం జిల్లాలోని పీఎం శ్రీ పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఎస్‌ఎంసీ చైర్మన్, మండల విద్యాశాఖాధికారి–2 లకు నిర్వహించిన సమీక్ష సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడారు. ప్లే గ్రౌండ్, కెమిస్ట్రీ ల్యాబ్ నకు మంజూరైన నిధులను మార్గదర్శకాలు అనుసరించి ఖర్చు చేయాలని, మంజూరైన స్కూల్ గ్రాంట్స్ కోసం వివరాలు వెంటనే అప్లోడ్ చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఒంగోలు డివిజన్ ఉపవిద్యాశాఖాధికారి ఎస్.సుబ్బారావు, సమగ్ర శిక్ష డీఈ మన్నయ్య, ఎంఈవో యం.రమేష్, మండల విద్యాశాఖాధికారు–2, ప్రధానోపాధ్యాయులు, విద్యా కమిటీ చైర్మన్లు పాల్గొన్నారు
Comments
Please login to add a commentAdd a comment