మా కడుపు కొడుతున్నారు
ఒంగోలు సబర్బన్: కూటమి పార్టీల నేతలు, ఒంగోలు నగర పాలక సంస్థ అధికారులు పారిశుధ్య విభాగంలో పనిచేస్తున్న మేసీ్త్రల కడుపు కొడుతున్నారని ఏపీ మున్సిపల్ వర్కర్ల యూనియన్ నాయకులు ధ్వజమెత్తారు. స్థానిక నగరపాలక సంస్థ కార్యాలయం ముందు గురువారం ధర్నా చేశారు. అధికారులు, కూటమి నాయకులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. యూనియన్ నాయకుడు కె.ఆదినారాయణ మాట్లాడుతూ కూటమి పార్టీల నాయకులు, ఒంగోలు నగర కమిషనర్ వెంకటేశ్వరరావు కలిసి మేసీ్త్రలను ఉద్యోగం నుంచి తొలగిచటం అత్యంత దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. మేసీ్త్రల స్థానంలో కూటమికి చెందిన కార్యకర్తలను నియమించుకునేందుకు కుట్ర పన్నుతున్నారని మండిపడ్డారు. నగరపాలక సంస్థలో గత 15 సంవత్సరాల నుంచి పారిశుధ్య విభాగంలో పనిచేస్తున్న మేసీ్త్ర విధుల్లో కొనసాగించాలని డిమాండ్ చేశారు. వేతనాలతో కూడిన మస్టర్ ఇవ్వాలని ఒంగోలు నగరంలో ఐదు డివిజన్లలో నిరసన కార్యక్రమం చేపట్టామన్నారు. పనిచేస్తున్న కార్మికులను విధుల్లో తీసుకోవాలని డిమాండ్ చేశారు. నగర అధ్యక్ష, కార్యదర్శులు జి.నరసింహ, టి.విజయమ్మ, యూనియన్ జిల్లా కార్యదర్శి శ్రీనివాసరావు, నాయకులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment