మట్టి బకాసురులు..! | - | Sakshi
Sakshi News home page

మట్టి బకాసురులు..!

Published Sun, Nov 24 2024 4:28 PM | Last Updated on Sun, Nov 24 2024 4:28 PM

మట్టి

మట్టి బకాసురులు..!

రెచ్చిపోతున్న

జిల్లాలో మట్టి మాఫియా విచ్చలవిడిగా రెచ్చిపోతోంది. కొండలు, గుట్టలు, వాగులు, వంకలను వదిలి పెట్టడం లేదు. రేయింబవళ్లు జేసీబీలతో యథేచ్ఛగా తవ్వేస్తూ టిప్పర్లు, లారీల్లో తరలించేస్తున్నారు. ఎవరైనా అడ్డువస్తే వారి మీద దాడులకు కూడా వెనకాడడం లేదు. అక్రమ కేసులు బనాయిస్తామంటూ బెదిరింపులకు దిగుతున్నారు. ఎమ్మెల్యే తాలూకా అంటూ వారు చేస్తున్న అరాచకాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. అధికార పార్టీ నేతల కనుసన్నల్లో ఈ దోపిడీ దర్జాగా సాగిపోతోంది.

సాక్షి ప్రతినిధి, ఒంగోలు: జిల్లాలో మట్టి అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. తవ్వుకున్నోడికి తవ్వుకున్నంత అన్నట్లుగా పగలు రాత్రి అనే తేడా లేకుండా జేసీబీలు పెట్టి మట్టిని తవ్వుకుంటున్నారు. అధికార తెలుగుదేశం పార్టీ ప్రజా ప్రతినిధుల కనుసన్నల్లోనే ఈ మట్టి దందా నడుస్తుండడం గమనార్హం. దీంతో అధికారులు చేష్టలుడిగి చూడడం తప్ప ఏమీ చేయలేకపోతున్నారు. ప్రధానంగా పశ్చిమ ప్రకాశంలోని మార్కాపురం, యర్రగొండపాలెం, గిద్దలూరు నియోజకవర్గాల్లో మట్టి మాఫియాకు అడ్డే లేకుండా పోతోంది. ఈ ప్రాంతంలో ఒక ఎమ్మెల్యేకు నెలవారీ మామూళ్లు అందుతున్నాయని ప్రచారం జరుగుతోంది. దోర్నాల ప్రాంతంలో మట్టి తవ్వకాల విషయంలో భారీ మొత్తంలో డిమాండ్‌ చేసినట్లు ఆ పార్టీ నాయకులు చెవులు కొరుక్కుంటున్నారు. ఒంగోలు ప్రాంతంలో పోలీసులు ట్రాక్టర్‌కు రూ.500 వసూలు చేస్తున్నట్లు సమాచారం. కొండపిలో దేవుడి భూములను కూడా వదిలి పెట్టకుండా మట్టిని తవ్వేస్తున్నారు.

నెలకు రూ.2 లక్షల కప్పం:

W§ýlª-Ë*Æý‡$ °Äñæ*-f-MýS-Ð]l-Æý‡Y…ÌZ Ð]l$sìæt-™èl-Ð]lÓ-M>Ë$ Ķæ$£ól^èleV> fÆý‡$-VýS$-™èl$¯é²Æ‡$$. W§ýlª-Ë*Æý‡$ Ð]l$…yýl-ÌS…ÌZ° MóSG‹Ü ç³ÍÏ çÜÒ$-ç³…ÌZ §ýl$í³µÌS-†ç³µ, EĶæ*ÅÌS-Ðéyýl çÜ…i-Ð]l-°õ³r ÐólÐ]l¬-ÌS-´ëyýl$, ç³rt-×æ…ÌZ° Æ>gê ¯]lVýSÆŠæ, çßZçܯ]l² Ð]l$…¨ÆŠ‡ Æøyýl$zÌZ° Mö…yýl {´ë…™èl…, Mö…VýSÌS-Òyýl$ {V>Ð]l*ÌS ç³Ç-«¨ÌZ Ð]l$sìæt ™øÌSM>Ë$ fÆý‡$VýS$-™èl$-¯éŠ-ి¯]lÅ. Æ>^èlÆý‡Ï ò³§ýlª ^ðlÆý‡$Ð]l#, MöÐ]l$Æø-Ë$ÌZ° ™ésìæ-^ðl-Æý‡ÏÌZ Ð]l$sìæt° ™èlÐ]l#ÓMýS$…-r$-¯é²Æý‡$. MýS…¿ýæ…ÌZ° H¯]l$VýS$Mö…yýl, »ôæçÜ¢-Ðé-Ç-õ³-rÌZ ò³…_-MýSÌS-´ëyýl$, AÆý‡¦-Òyýl$ÌZ ¯éVýS$-ÌS-Ð]lÆý‡… Mö…yýl ¯]l$…_ Ð]l$sìæt° ™èlÐólÓ-çÜ$¢¯é²Æý‡$. D °Äñæ*f-MýS-Ð]l-Æý‡Y…ÌZ {糆 Ð]l$…yýlÌS… ¯]l$…_ ¯ðlÌSMýS$ Æý‡*.2 ÌS„ýS-ÌS¯]l$ MîSÌSMýS ¯éĶæ$MýS$yìl ™èlÐ]l¬Ã-yìlMìS MýSç³µ… ^ðlÍÏ-çÜ$¢¯]l²r$Ï BÆø-ç³-×æË$ ÐðlË$ÏÐðl-™èl$¢-™èl$-¯é²Æ‡$$.

బేరం కుదరలేదని పని ఆపేశారు:

యర్రగొండపాలెం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి అవినీతి మీద వస్తున్నన్ని ఆరోపణలు మరెక్కడా రావడం లేదు. ఇక్కడ మట్టి పనుల్లో కూడా పెద్ద ఎత్తున అవినీతి జరుగుతోందనేది బహిరంగ రహస్యం. దోర్నాల వద్ద జాతీయ రహదారి పనులు జరుగుతున్నాయి. ఇందుకోసం హనుమాన్‌ జంక్షన్‌ వద్ద కొండ నుంచి మట్టిని తరలిస్తున్నారు. అయితే తన సంగతేందని ఇన్‌చార్జి బావమరిది సదరు కాంట్రాక్టర్‌ను అడిగినట్లు తెలుస్తోంది. భారీ మొత్తంలో డబ్బులు డిమాండ్‌ చేయడంతో ఆ కాంట్రాక్టర్‌ నోరెళ్లబెట్టినట్లు సమాచారం. అంతపెద్ద మొత్తంలో డబ్బులు ఇవ్వలేనంటూ చేతులెత్తేయడంతో పది రోజుల పాటు పనులు ఆపేసినట్లు తెలుస్తోంది. ఆ తరువాత బేరం కుదరడంతో ఇప్పుడు పనులు పునఃప్రారంభమయ్యాయని చెప్పుకుంటున్నారు. యర్రగొండపాలెంలోని దశబంధం చెరువు, రాళ్లవాగు, మురారిపల్లి చెరువు, గురిజేపల్లి, బోయలపల్లి చెరువుల నుంచి నిరంతరాయంగా తవ్వకాలు సాగుతున్నాయి.

కొత్తపట్నం నుంచి...

ఒంగోలు నియోజకవర్గంలో మట్టి తవ్వకాలకు కొత్తపట్నం అడ్డాగా మారింది. కొత్తపట్నం మండలంలోని మడనూరు, ఈతముక్కల, రాజుపాలెం, గౌడపాలెం, గమళ్లపాలెం, గుండుమాల ప్రాంతాల్లో జోరుగా మట్టి తవ్వకాలు జరుగుతున్నాయి. అల్లూరు నుంచి అన్నవరప్పాడు మీదుగా ఒంగోలుకు మట్టిని తరలిస్తున్నట్లు సమాచారం. రాత్రిళ్లు మట్టిని ఒంగోలుకు తరలించి నెల్లూరు బైపాస్‌ సమీపంలో నిల్వ చేసుకొని మరుసటి రోజు విక్రయాలు చేస్తున్నట్లు సమాచారం. మండలంలోని కరవది, ఉలిచి, సంతనూతలపాడు నియోజకవర్గంలోని మద్దిపాడు నుంచి కూడా అక్రమంగా మట్టిని తరలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక దర్శి నియోజకవర్గంలోని దర్శి, ముండ్లమూరు, తాళ్లూరు, దొనకొండ, కురిచేడు మండలాల్లో మట్టి తవ్వకాలు జోరుగా కొనసాగుతున్నాయి.

ప్రజా ప్రతినిధులకు వాటాలు..

జిల్లాలో జరుగుతున్న మట్టి అక్రమ రవాణా మొత్తం అధికార పార్టీ ఎమ్మెల్యేల కనుసన్నల్లోనే జరుగుతుందని సమాచారం. నియోజకవర్గంలో ఎవరు పడితే వారు మట్టి తవ్వుకోడానికి వీల్లేదని, కేవలం తెలుగుదేశం పార్టీకి చెందిన వారు మాత్రమే మట్టిని తవ్వుకోవాలని హుకుం జారీ చేయడంతో మట్టి వ్యాపారంలో తమ్ముళ్లు తలమునకలయ్యారు. నెలవారీ కమీషన్లు ఇవ్వాలని కొందరు ఎమ్మెల్యేలు డిమాండ్‌ చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే పశ్చిమ ప్రకాశం జిల్లాలో మామూళ్ల బేరాలు కుదిరినట్లు చెప్పుకుంటున్నారు. దర్శి నియోజకవర్గంలో టిప్పర్‌కు ఏడాదికి రూ.30 నుంచి రూ.60 వేలు డిమాండ్‌ చేస్తున్నట్లు ప్రచారం. యర్రగొండపాలెం ఇన్‌చార్జ్‌ తరఫున ఆయన బావమరిది పెద్ద మొత్తంలో డిమాండ్‌ చేస్తున్నట్లు ఆ పార్టీ నాయకులే అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. కొండపిలో అంతా సత్య చూసుకుంటున్నారని అధికారులు, అధికార పార్టీ నాయకులు గుసగుసలాడుతున్నారు.

దేవుడి భూములను వదిలిపెట్టలేదు

రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి ప్రాతినిధ్యం వహిస్తున్న కొండపి నియోజకవర్గంలో తమ్ముళ్లు దేవుడి భూములను కూడా వదిలి పెట్టడంలేదు. సింగరాయకొండ మండలంలోని పాత సింగరాయకొండ వరాహ లక్ష్మీనరసింహ స్వామి దేవాలయానికి చెందిన భూములను పెద్ద మొత్తంలో మట్టిని తవ్వుకుంటున్నట్లు విశ్వసనీయ సమాచారం. అలాగే పాత సింగరాయకొండ, శానంపూడి, కనుమర్ల ప్రాంతాల్లోని మర్రిచెరువు, సింగినంపల్లి చెరువు, జువ్వలగుంట చెరువు, రాజు చెరువుల నుంచి అక్రమంగా మట్టి తవ్వకాలు జరుగుతున్నాయి. అంతేకాకుండా కొందరు వ్యాపారులు ప్రభుత్వ భూములు, పట్టా భూములను లీజుకు తీసుకొని ఎర్ర మట్టిని తవ్వుకుంటున్నారు. మట్టిని తవ్వుకున్న తరువాత ఏర్పడిన గుంతలను చెరువుల నుంచి మట్టిని తెచ్చి పూడ్చేలా లీజులో ఒప్పందం చేసుకుంటున్నారు. దాంతో ఎర్రమట్టి గుంతల్లో నల్ల మట్టి తెచ్చి పూడుస్తుండడంతో భూముల స్వభావం మారిపోతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

రేయింబవళ్లు తవ్వుకున్నోడికి తవ్వుకున్నంత ఇష్టారాజ్యంగా అక్రమ రవాణా ఎమ్మెల్యే తాలూకా అంటూ యథేచ్ఛగా తవ్వకాలు టన్నులకొద్దీ మట్టి తరలించి సొమ్ము చేసుకుంటున్న తమ్ముళ్లు నెలవారీగా ప్రజా ప్రతినిధులకు అందుతున్న తాంబూలాలు మామూళ్ల మత్తులో కళ్లు మూసుకుంటున్న అధికారులు

మామూళ్ల మత్తులో అధికారులు..

టన్నులకొద్దీ మట్టిని అక్రమంగా తరలించుకుపోతున్నా అధికారులు చోద్యం చూస్తున్నారు. నెలవారీ మత్తులో కొందరు అధికారులు వ్యాపారులకు సహకరిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఒంగోలు నియోజకవర్గంలో ఈతముక్కల, అల్లూరు వద్ద పోలీసు నిఘా ఏర్పాటు చేశారు. అయితే పోలీసులు ట్రాక్టర్‌కు రూ.500 తీసుకొని వదిలిపెడుతున్నట్లు సమాచారం. చెరువులను తవ్వుకుంటున్నా ఇరిగేషన్‌ అధికారులు పట్టించుకోవడం లేదు. ఈ విషయం గురించి ఒక అధికారిని వివరణ అడుగగా.. అధికార పార్టీ ఎమ్మెల్యే తాలూకా అని చెబుతున్నప్పుడు మేమేమీ చేయలేమని చేతులెత్తేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
మట్టి బకాసురులు..! 1
1/1

మట్టి బకాసురులు..!

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement