చదరంగ పోటీల్లో ఒంగోలు విద్యార్థిని ప్రతిభ
ఒంగోలు: జాతీయ స్థాయి చదరంగ పోటీల్లో ఒంగోలుకు చెందిన ఆముక్త మరోసారి సత్తాచాటింది. స్థానిక పీవీఆర్ బాలికల ఉన్నత పాఠశాలలో 6వ తరగతి చదువుతున్న ఆముక్త.. ఇటీవల అండర్–13 బాలికల విభాగంలో పశ్చిమ బెంగాల్‌లోని దుర్గాపూర్‌లో నిర్వహించిన జాతీయ స్థాయి చెస్ చాంపియన్‌షిప్‌లో పాల్గొంది. నాలుగో స్థానంలో నిలిచి రూ.35 వేల నగదు బహుమతితో పాటు ఈ ఏడాది జరిగే కామన్వెల్త్ చదరంగ పోటీల్లో పాల్గొనేందుకు అర్హత సాధించింది.
నేడు ప్రభుత్వ పెన్షనర్ల సర్వసభ్య సమావేశం
ఒంగోలు అర్బన్: రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సంఘ జిల్లా శాఖ వార్షిక సర్వసభ్య సమావేశాన్ని శనివారం నిర్వహించనున్నట్లు సంఘ జిల్లా అధ్యక్షుడు అంకిరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఒంగోలులోని ఎన్‌జీఓ హోం సమావేశ మందిరంలో ఉదయం 9 గంటలకు సమావేశం ప్రారంభమవుతుందని చెప్పారు. సమావేశానికి పెన్షనర్ల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు డి.వెంకటేశ్వర్లు, జనరల్ సెక్రటరీ ప్రభుదాస్‌తో పాటు ఇతర అఽతిథులు హాజరవుతారని తెలిపారు. 75 సంవత్సరాలు నిండిన జీవిత సభ్యులకు సత్కారం చేయనున్నట్లు చెప్పారు. ప్రభుత్వ పెన్షనర్లు హాజరుకావాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment