నిరసనల హోరుతో పోరుబాట
ఒంగోలు సిటీ: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు ఒంగోలులో నియోజకవర్గ ఇన్‌చార్జ్ చుండూరు రవిబాబు ఆధ్వర్యంలో నిర్వహించిన కరెంటు చార్జీల బాదుడుపై వైఎస్సార్ సీపీ పోరుబాట నిరసన కార్యక్రమం విజయవంతమైంది. చుండూరు రవిబాబుతో పాటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు జూపూడి ప్రభాకరరావు, ఎస్సీ సెల్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకరబాబు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్తుల బ్రహ్మానందరెడ్డి, లిడ్ క్యాప్ మాజీ చైర్మన్ కాకుమాను రాజశేఖర్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వాణిజ్య విభాగం అధ్యక్షుడు కుప్పం ప్రసాద్ ఒంగోలు చర్చి సెంటర్ లోని వైఎస్సార్ విగ్రహానికి, అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ర్యాలీగా వెళుతూ వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, రైతులు బాదుడే బాదుడు అంటూ నినాదాలు చేశారు. అన్నవరప్పాడు మూడో లైన్ వద్ద విద్యుత్ భవన్ వరకు ర్యాలీగా వెళ్లి విద్యుత్ అధికారులకు వినతిపత్రం అందజేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులతో నిర్వహించిన నిరసన విజయవంతమైంది.
ఒంగోలు నియోజకవర్గ ఇన్‌చార్జ్ చుండూరు రవిబాబు మాట్లాడుతూ పెంచిన విద్యుత్ చార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. ట్రూఅప్ చార్జీల పేరిట ప్రజలపై రూ.15,485.36 కోట్ల భారాన్ని మోపారన్నారు. చంద్రబాబు అబద్దాలు, మోసాలు మళ్లీ ఒకసారి రుజువవుతున్నాయని, వాటిని ప్రజలు గమనిస్తూనే ఉన్నారన్నారు. మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి కరెంటు చార్జీలు పెంచారని అనేక ఆరోపణలు చేసిన చంద్రబాబు అధికారంలోకి వస్తే పెంచబోనని, తగ్గిస్తానన్నారు. జగనన్న ప్రభుత్వంలో ఉచితంగా ఎస్సీ, ఎస్టీలకు 200 యూనిట్లు ఇస్తే ప్రస్తుతం వాళ్ల ఇంటికి కూడా ట్రూఅప్ చార్జీల పేరుతో వెయ్యి రూపాయల నుంచి రూ.3 వేల వరకు ఇళ్లకు బిల్లులు పంపుతున్నారని, దాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలన్నారు. విద్యుత్ చార్జీల పెంపునకు నిరసనగా ర్యాలీగా వెళ్లి విద్యుత్ కార్యాలయ అధికారులకు వినతిపత్రం అందజేశామన్నారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకరరావు మాట్లాడుతూ అబద్దాల ద్వారా అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. అబద్దాలకోరులు ప్రజలను జీవితకాలం మోసం చేయాలనుకుంటే పొరపాటని, ఈ అబద్దాలను ప్రజలు తెలుసుకున్న తర్వాత ఒక్క నిమిషం కూడా కుర్చీలో కూర్చోలేరన్నారు.
రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకరబాబు మాట్లాడుతూ పెంచిన విద్యుత్ చార్జీలను వెంటనే తగ్గించాలని, ఎన్నికల హామీని నిలబెట్టుకోవాలన్నారు. ఈ ఆరు నెలల్లోనే చంద్రబాబు ప్రజలపై భరించలేని భారం వేశారని విమర్శించారు. ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే గళం విప్పుతూనే ఉంటామని, రోడ్ల మీదకు వస్తూనే ఉంటామని, కేసులకు, వేధింపులకు భయపడేది లేదన్నారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజలపై మోపిన పన్నుల భారం రద్దు చేస్తానన్నారు. రైతు రుణమాఫీ చేస్తానని చెప్పి అధికారంలో వచ్చి చేయకుండా నిట్టనిలువునా మోసం చేశాడన్నారు. రుణమాఫీ చేసింది వైఎస్సార్ అయితే రుణమాఫీ చేస్తానని చెప్పి కనీసం వడ్డీ కూడా మాఫీ కూడా చేయనివాడు చంద్రబాబు అన్నారు. చంద్రబాబు వచ్చిన ఆరు నెలలకే ఇప్పటికే రూ.6072 కోట్లు వసూలు ప్రారంభించారని, మళ్లీ జనవరిలో రూ.9412 కోట్లు పెంచే నిర్ణయంతో మొత్తం రూ.15,480 వేల కోట్లకు పైగా భారాన్ని ప్రజలపై మోపాలని చూడటం హేయమైన చర్య అన్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ, పెంచిన చార్జీలను వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.
– లిడ్ క్యాప్ మాజీ చైర్మన్ కాకుమాను రాజశేఖర్ మాట్లాడుతూ చంద్రబాబు పరిపాలన అంటే విద్యుత్ చార్జీలతో దోపిడీ, బాదుడుగా మారిపోయిందన్నారు. చంద్రబాబు పాలనలో ప్రజలపై కరెంట్ చార్జీల భారం మోపి నడ్డి విరుస్తున్నారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా చంద్రబాబు నిట్టనిలువునా మోసం చేశాడని విమర్శించారు.
కార్యక్రమంలో ఒంగోలు నగర అధ్యక్షుడు కఠారి శంకరరావు, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర వాణిజ్య విభాగం అధ్యక్షులు కుప్పం ప్రసాద్, బీసీ సెల్ అధ్యక్షుడు బొట్లా సుబ్బారావు, లీగల్ సెల్ అధ్యక్షుడు నగరికంటి శ్రీనివాసరావు, వైఎస్సార్‌సీపీ నాయకులు దామరాజు క్రాంతికుమార్, జెడ్పీటీసీ సైకం లక్ష్మీశారద, కార్పొరేటర్లు ఇమ్రాన్‌ఖాన్, ప్రవీణ్‌కుమార్, శ్యాంసాగర్, వెన్నపూస వెంకటేశ్వరరెడ్డి, నాగూర్, వైఎస్సార్‌సీపీ నాయకులు చావలి శివ, యరజర్ల రమేష్, పసుమర్తి గోపిచంద్, తాతా శ్రీనివాసులు, ఆళ్ల రవీంద్రరెడ్డి, మిట్నశాల శాంతారావు, పి.కోటేశ్వరరావు, కె.కోటియాదవ్, రొండా అంజిరెడ్డి, బడుగు ఇందిర, బత్తుల ప్రమీల, భూమిరెడ్డి రమణమ్మ, విజయలక్ష్మీ, వడ్లమూడి వాణి, ప్రసన్న, మేరీ, రమణమ్మ, ముళ్లంగి రవీంద్రరెడ్డి, పిగిలి శ్రీను, కఠారి సాయి, మీరావళి, పులుసు సురేష్, బీసీ సెల్ నగర అధ్యక్షుడు సుతారం శ్రీనివాసులు, పి.సుధాకర్, వెంకయ్యనాయుడు, కఠారి ప్రసాద్, ఎం.సూర్యరాజేష్, జాకీర్ హుస్సేన్, ఎంపీటీసీ మన్నే శ్రీనివాసరావు, భాస్కర్, గోనెల శివకుమార్, గద్దల బుజ్జి, పురిణి గోపి, దేవా, కొప్పోలు ప్రభాకర్, వెంకట రామిరెడ్డి, కాళీ యాదవ్, మేడికొండ అంకబాబు, శ్రీనివాసులరెడ్డి, కమ్మ సురేష్, గద్దల సులోమాన్ తదితరులు పాల్గొన్నారు.
బాదుడే బాదుడు అంటూ నినాదాలు చేసిన వైఎస్సార్ సీపీ శ్రేణులు పెంచిన విద్యుత్ చార్జీలను తగ్గించాలని డిమాండ్ ఒంగోలులో నియోజకవర్గ ఇన్‌చార్జ్ చుండూరు రవిబాబు ఆధ్వర్యంలో నిరసన
Comments
Please login to add a commentAdd a comment