● చోరీ నేపథ్యంలో రెండు కుటుంబాల మధ్య ఘర్షణ
కంభం: తాళం వేసిన ఇంట్లో చోరీ సంఘటన రెండు కుటుంబాల మధ్య వివాదానికి దారితీసింది. కంభం పంచాయతీ పరిధిలోని సాదుమియా వీధిలో ఉంటున్న బీబీజాన్ తన తల్లికి వైద్యం చేయించేందుకు మంగళవారం ఇంటికి తాళం వేసి ఆస్పత్రికి వెళ్లింది. తిరిగి ఇంటికి వచ్చే సరికి తాళం తెరిచి ఉండటాన్ని గమనించింది. లోపలికి వెళ్లి చూడగా రెండు తులాల బంగారు నగలు, నగదు, ఒక సెల్ ఫోన్ కనిపించలేదు. సమీపంలో ఉన్న ఒకరిపై అనుమానం వచ్చి వారి ఇంట్లోకి వెళ్లి తనిఖీ చేయగా నగలు, నగదు దొరికినట్లు తెలిసింది. అనంతరం నగలు దొరికిన ఇంటికి చెందిన వారు, నగదు పోయిన కుటుంబ సభ్యుల మధ్య వాగ్వివాదం ఘర్షణకు దారి తీసింది. మున్నా అనే వ్యక్తికి చేయి విరిగింది. క్షతగాత్రుడిని కంభం ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా వారు మార్కాపురానికి సిఫార్సు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment