మొన్న హాంఫట్.. నేడు పర్‌ఫెక్ట్
● టీడీపీ నేత ఆక్రమించిన 10 ఎకరాల భూమి స్వాధీనం
● మొక్కలు తొలగించి హెచ్చరిక బోర్డు పెట్టిన అధికారులు
తర్లుపాడు: మార్కాపురం–తర్లుపాడు సరిహద్దులోని గానుగపెంట గ్రామ సమీపంలో టీడీపీ నేతల ఆక్రమించిన 10 ఎకరాల పశువుల బీడు భూమిని రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మార్కాపురం మండలం రాయవరం గ్రామానికి చెందిన ఓ టీడీపీ నేత భూకబ్జాకు పాల్పడిన వైనంపై ‘రూ.2 కోట్ల భూమి హాంఫట్’ శీర్షికన మంగళవారం ‘సాక్షి’లో ప్రచురితమైన రెండు కోట్ల భూమి హాంఫట్ కథనంపై తహసీల్దార్ విజయభాస్కర్ స్పందించారు. ఆక్రమిత ప్రాంతానికి సిబ్బందితో కలిసి వెళ్లి టీడీపీ నేత నాటిన మామిడి, కొబ్బరి మొక్కలను తొలగింపజేశారు. ప్రభుత్వ భూమిని ఆక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment