ఎస్సీ కులపోడిననేగా వివక్ష
● కుళాయి కనెక్షన్ ఇవ్వకపోవడంపై గలిజేరుగుళ్ల ఎంపీటీసీ సురేష్ ఆవేదన
● సర్వ సభ్య సమావేశంలో నేలపై బైఠాయించి నిరసన
బేస్తవారిపేట: కుళాయి కనెక్షన్ ఇవ్వడంలో వివక్ష చూపడంపై బేస్తవారిపేట మండలం గలిజేరుగుళ్ల ఎంపీటీసీ సభ్యుడు కుంపటి సురేష్ నిరసన తెలిపారు. మంగళవారం మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో అధికారుల ఎదుట నేలపై బైఠాయించి నిలదీశారు. ప్రజాప్రతినిధినైన తాను పలుమార్లు తమ ఇంటికి కుళాయి కనెక్షన్ ఇవ్వాలని కోరినా పట్టించుకోవడం లేదని, పక్కన గృహాలకు ఇచ్చి తనకుకెందుకు ఇవ్వడం లేదని ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ నాయక్, పంచాయతీ కార్యదర్శి ఆవులయ్యపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జలజీవన్ నిధులతో పనులు చేయకుండా ఫోర్జరీ సంతకాలతో పనులు నిలిపివేశారని ఆరోపించారు. ఎస్సీ కులంవాడిననే చిన్నచూపు చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment