సంక్రాంతికి 264 ఆర్టీసీ ప్రత్యేక బస్సు సర్వీసులు
● డీపీటీవో బి.సుధాకర్ వెల్లడి
ఒంగోలు టౌన్: సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆర్టీసీ 264 ప్రత్యేక బస్సు సర్వీసులను నడుపుతున్నట్లు జిల్లా ప్రజా రవాణాధికారి బి.సుధాకర్ తెలిపారు. మంగళవారం ఆర్టీసీ డిపోలోని ఆర్‌ఎం కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. తెలుగు వారి పెద్ద పండుగైన సంక్రాంతికి హైదరాబాద్, బెంగళూరు, చైన్నె తదితర దూర ప్రాంతాల నుంచి జిల్లాలోని వివిధ ప్రాంతాలకు పెద్ద సంఖ్యలో ప్రయాణికులు వస్తారని తెలిపారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని జిల్లా వ్యాప్తంగా ఉన్న 5 డిపోల నుంచి ప్రత్యేక సర్వీసులు నడపనున్నట్లు చెప్పారు. ఈ నెల 10 నుంచి 13వ తేదీ వరకు ఇంద్ర ఏసీ, సూపర్ లగ్జరీ, అల్ట్రా డీలక్స్, ఎక్స్‌ప్రెస్ బస్సు సర్వీసులను నడపనున్నట్లు తెలిపారు. హైదరాబాద్ నుంచి 242 బస్సు సర్వీసులు, బెంగళూరు నుంచి 12 , చైన్నె నుంచి 10 బస్సు సర్వీసులు నడుపుతారన్నారు. ఇందుకు మొత్తం కొత్త హయ్యర్ బస్సులు అందుబాటులో ఉన్నట్లు చెప్పారు. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రతి డిపోలోను ప్రత్యేక టీంలను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. ముందుగా రిజర్వ్ చేసుకున్న వారికి 10 శాతం రాయితీ సదుపాయాన్ని కల్పించామని, ప్రత్యేక సర్వీసులన్నిటినీ సాధారణ చార్జీలతో బస్సులను నడుతున్నట్లు తెలిపారు. ఏపీ ఆర్టీసీ లైవ్ యాప్‌ను డౌన్ లోడ్ చేసుకోవడం ద్వారా ప్రయాణికులు తాము ప్రయాణించే బస్సును సర్వీస్ నంబర్ ఆధారంగా సులువుగా ట్రాక్ చేయవచ్చన్నారు. ఒకవేళ బస్సు మిస్సయినా డిపోలో ఉండే సిబ్బంది, అధికారులను సంప్రదిస్తే సమాచారం ఇచ్చేలా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రయాణికుల సౌలభ్యం కోసం అదనంగా స్టాండ్ బై బస్సులను కూడా సిద్ధం చేసి ఉంచుతున్నట్లు చెప్పారు. ప్రైవేటు బస్సులపై తమకు ఎలాంటి అధికారం లేదన్నారు. సంక్రాంతి పండుగకు సుమారు అప్ అండ్ డౌన్ కలుపుకొని 500 బస్సు సర్వీసుల వరకు నడుపుతున్నారని, ఈ ఏడాది సుమారు 50 వేల మందికి పైగా పండుగకు రావచ్చని భావిస్తున్నామని తెలిపారు. సురక్షిత ప్రయాణం, సౌకర్యవంత ప్రయాణం కోసం ఆర్టీసీ బస్సులో ప్రయాణించాలని కోరారు.
డిపోల వారీగా బస్సు సర్వీసులు ఇలా...
తేదీ ఒంగోలు డిపో గిద్దలూరు కనిగిరి మార్కాపురం పొదిలి
9 3 సూపర్ లగ్జరీ 3 ఆల్ట్రా డీలక్స్ 3 సూపర్ లగ్జరీ 4 సూపర్ లగ్జరీ 2 సూపర్ లగ్జరీ
4 ఆల్ట్రా డీలక్స్ 1 ఎక్స్‌ప్రెస్ 3 ఆల్ట్రా డీలక్స్ 2 ఎక్స్‌ప్రెస్
10 3 ఇంద్ర ఏసీ 2 సూపర్ లగ్జరీ 6 సూపర్ లగ్జరీ 6 సూపర్ లగ్జరీ 5 సూపర్ లగ్జరీ
8 సూపర్ లగ్జరీ 6 ఆల్ట్రా డీలక్స్ 7 ఆల్ట్రా డీలక్స్ 8 ఎక్స్‌ప్రెస్ 3 ఎక్స్‌ప్రెస్
6 ఆల్ట్రా డీలక్స్ 5 ఎక్స్‌ప్రెస్ 5 ఎక్స్‌ప్రెస్
2 ఎక్స్‌ప్రెస్
11 3 ఇంద్ర ఏసీ 2 సూపర్ లగ్జరీ 6 సూపర్ లగ్జరీ 6 సూపర్ లగ్జరీ 5 సూపర్ లగ్జరీ
8 సూపర్ లగ్జరీ 6 ఆల్ట్రా డీలక్స్ 7 ఆల్ట్రా డీలక్స్ 7 ఎక్స్‌ప్రెస్ 2 ఎక్స్‌ప్రెస్
6 ఆల్ట్రా డీలక్స్ 3 ఎక్స్‌ప్రెస్ 4 ఎక్స్‌ప్రెస్
2 ఎక్స్‌ప్రెస్
12 3 ఇంద్ర ఏసీ 2 సూపర్ లగ్జరీ 6 సూపర్ లగ్జరీ 6 సూపర్ లగ్జరీ 5 సూపర్ లగ్జరీ
8 సూపర్ లగ్జరీ 6 ఆల్ట్రా డీలక్స్ 7 ఆల్ట్రా డీలక్స్ 8 ఎక్స్‌ప్రెస్ 3 ఎక్స్‌ప్రెస్
6 ఆల్ట్రా డీలక్స్ 5 ఎక్స్‌ప్రెస్ 5 ఎక్స్‌ప్రెస్
2 ఎక్స్‌ప్రెస్
13 2 సూపర్ లగ్జరీ 1 ఆల్ట్రా డీలక్స్ 1 సూపర్ లగ్జరీ – 1 సూపర్ లగ్జరీ
Comments
Please login to add a commentAdd a comment